శ్రీకాకుళం, జూన్ 17 : కవేరాగా ప్రసిద్ధి చెందిన సాహిత్యవేత్త కణుగుల వెంకటరావు మృతి పట్ల రెడ్ క్రాస్ చైర్మన్ పి. జగన్మోహన రావు సంతాపం వ్యక్తం చేశారు. ప్రముఖ వైద్యులు సుధీర్ తండ్రి కణుగుల వెంకటరావు గురువారం ఉదయం గుండెపోటుతో మరణించారు. సీనియర్ పోస్టల్ సూపరింటెండెంట్ గా పదవీ విరమణ చేసిన కణుగుల చిన్న వయసు నుంచే సాహిత్య వ్యాసంగం ఆరంభించారు. మిసిమి, భారతి, ఆంధ్రజ్యోతి తదితర పత్రికలలో వందల కొద్దీ వ్యాసాలు రాశారని ఆయన అన్నారు. ఆయన మృతి శ్రీకాకుళం జిల్లాకు తీరని లోటని పేర్కొన్నారు. సాహిత్యలోకం ఒక గొప్ప సాహిత్య వేత్తను కోల్పోయిందని అన్నారు. కనుగుల కుటుంబ సభ్యులకు సంతాపాన్ని తెలిపారు.
రెడ్ క్రాస్ సభ్యులు బలివాడ మల్లేశ్వర రావు, డా. నిక్కు అప్పన్న తదితరులు కూడా సంతాపం తెలిపారు.
0 Comments