శ్రీకాకుళం, జూన్ 17: భవన నిర్మాణాలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ ఆదేశించారు. శ్రీకాకుళం మండలంలో కిల్లిపాలెం గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ తదితర ప్రభుత్వ భవనాల నిర్మాణాలను కలెక్టర్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. రైతు భరోసా కేంద్రాలు జూలై 8న ప్రారంభానికి సిద్ధం చేయాలని ఆయన స్పష్టం చేశారు. భవన నిర్మాణ పక్షోత్సవాలలో భాగంగా ప్రత్యేక శ్రద్ధ వహించి నిర్మాణ పనులు పూర్తి చేయాలని సంబంధిత ఇంజనీర్లను ఆదేశించారు. బిల్లుల చెల్లింపులో ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని, ప్రతి వారం చెల్లింపులకు చర్యలు చేపట్టిందని కలెక్టర్ తెలిపారు. భవన నిర్మాణాలు పూర్తి కావడం వలన ప్రజలకు సేవలు అందుబాటులోకి వస్తాయని ఆయన చెప్పారు. నిర్మాణాలు సకాలంలో పూర్తి కాక పోవడం వలన ప్రజలకు సేవలు అందడంలో జాప్యం జరుగుతుందని వారు అసౌకర్యానికి గురి అయ్యే పరిస్థితి ఉండదని ఆయన అన్నారు. ప్రజలకు మంచి సేవలు అందించడమే లక్ష్యంగా ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత ఇంజనీర్లు, మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
0 Comments