ప్రజా పత్రిక -శ్రీకాకుళం : ప్రైవేట్ ఆస్పత్రులు కోవిడ్ ధరలను ప్రకటించాలని జిల్లా కలెక్టర్ జె నివాస్ ఆదేశించారు. ఈ మేరకు ఒక ప్రకటన జారీ చేస్తూ కోవిడ్ చికిత్సకు అనుమతులు పొందిన ఆసుపత్రులు ప్రభుత్వం సూచించిన మేరకు కోవిడ్ చికిత్స ధరలను ప్రకటించాలని పేర్కొన్నారు. ధరలను ఆస్పత్రి నోటీస్ బోర్డ్ లో ప్రదర్శించాలని ఆయన స్పష్టం చేశారు. ఆస్పత్రులపై తనిఖీలు నిర్వహిస్తామని, నిబంధనలు ఉల్లంఘించిన వాటిపై మొదటి సారి తనిఖీలో భాగంగా అపరాధ రుసుము విధించడం జరుగుతుందని ఆయన చెప్పారు. రెండోసారి తనిఖీలో ఆదేశాలను పాటించని ఆస్పత్రులపై క్రిమినల్ కేసు నమోదు చేస్తామని కలెక్టర్ నివాస్ హెచ్చరించారు. జిల్లాలో ప్రతి ప్రైవేట్ ఆసుపత్రి నిబంధనలు విధిగా పాటించి అనవసరపు చర్యలకు లోనుకావద్దని ఆయన సూచించారు.
0 Comments