ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

సూర శ్రీనివాస్ కి డిప్యూటీ సీఎం సత్కారం

శ్రీకాకుళం,జూన్ 15: కోవిడ్ సమయంలో ఒక సామాజిక సేవకునిగా గత 35 రోజుల నుంచి నిత్యావసర సరుకులు, రోగులకు వారి సేవకులకు ఆహారాన్ని  అందిస్తున్న ప్రముఖ వ్యాపారవేత్త సూర శ్రీనివాస్ ను డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ బుధవారం అభినందించారు.  సూర శ్రీనివాస్  స్వచ్ఛందంగా రిమ్స్, జెంస్ హాస్పిటల్స్ లో రోజుకు 500 మందికి ఆహారాన్ని పంపిణీ చేస్తున్నారు. ప్రైవేట్ విద్యాసంస్థల అధ్యాపకులకు నెలకు సరిపడా నిత్యావసరాలు అందించారు.  జిల్లా న్యాయ శాఖ సిబ్బంది కూడా నెలకు సరిపడా కిట్లను పంపిణీ చేశారు.  ఈ విషయం తెలుసుకున్న డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ పోలాకి మండలం మబగాంలోని తన క్యాంపు కార్యాలయంలో బుధవారం ఉదయం శాలువా వేసి సత్కరించారు. మంచి పనులు చేసి మార్గదర్శకులుగా నిలవాలని కోరారు. త్వరలో జర్నలిస్టుల కుటుంబాలకు, ఇతర కోవిడ్ వారియర్స్ కు నిత్యావసరాలు పంపిణీ చేయనున్నామని సూర శ్రీనివాస్ ఈ సందర్భంగా తెలిపారు. ఇటువంటి సేవలు అందించడం వల్ల మరింత మందికి శ్రీనివాస్ స్పూర్తిదాయకంగా నిలుస్తున్నారని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్  అభినందించారు.

Post a Comment

0 Comments