ప్రజా పత్రిక-శ్రీకాకుళం : రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి చేపట్టిన పలు సంక్షేమ, అభివృద్ధి పథకాల వలన రెండేళ్లుగా శ్రీకాకుళం శాసనసభ నియోజకవర్గం మునుపెన్నడూలేని విధంగా అభివృద్ధి చెందుతుందని స్థానిక శాసనసభ్యులు ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. నియోజకవర్గంలో మన బడి, నాడు-నేడు, వై.యస్.ఆసరా, సున్నావడ్డీ, వై.యస్.ఆర్.సంపూర్ణ ఫోషణ, జగనన్న తోడు, వై.యస్.ఆర్.పింఛను, రైతు భరోసా కేంద్రాలు, పేదలందరికీ ఇళ్లు వంటి పలు సంక్షేమ కార్య్రకమాలు ఇప్పటికే అమలవుతున్న సంగతిని ఆయన గుర్తుచేసారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన బడి, నాడు-నేడు పనుల్లో ఫేజ్ -1 క్రింద శ్రీకాకుళం నగర పాలక సంస్థ పరిధిలోని 16 పాఠశాలలను రూ.6.94 కోట్ల వ్యయoతో పనులు చేపట్టి ఈ మాసాంతమునకు పూర్తిచేయుటకు ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది. అలాగే ఫేజ్ – 2లో నగరపాలక సంస్థ పరిధిలో మిగిలిఉన్న 15 పాఠశాలలకు ఆధునీకరణ, సుందరీకరణ పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు పంపడం జరిగిందని అన్నారు. శ్రీకాకుళం నగరాన్ని స్మార్ట్ సిటీగా ప్రభుత్వo ప్రకటించినందున ఆ పథకంలో భాగంగా ఈ దిగువ తెలిపిన అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు ఆయన వివరించారు.
నియోజక వర్గ పరిధిలో :
• నాగావళి నది యందు భూగర్బ ఆనకట్ట నిర్మాణానికై రూ.4.93 కోట్లు కేటాయింపు.
• అమృత్ ఫేజ్-1 : అమృత్ పధకములో భాగంగా ఫేజ్-1లో పైప్ లైన్లు లేని ఏరియాలలో 37 కిలోమీటర్ల పైప్ లైన్ ఏర్పాటుచేసామని, అలాగే ఇప్పటివరకు ,7250 గృహాలకు మంచినీటి కొళాయి కనెక్షన్ రూ 10.73 కోట్లతో వ్యయoతో ఏర్పాటుచేసామన్నారు.
• అమృత్ ఫేజ్-2 : అమృత్ పధకంలో భాగంగా ఫేజ్-2 యందు ఎస్.టి.పి (మురుగునీటి శుద్ది కేంద్రం) రూ.29.00 కోట్లతో వ్యయoతో పూర్తి చేయుటకు ప్రతిపాదించబడిన పనులు జరుగుచున్నాయని చెప్పారు.
• మిర్తిబట్టి ఆధునీకరణ మరియు నాగావళి నదిలోకి మురుగు నీరు కలవకుండా సదరు మురికి నీటిని మురుగు నీటి శుద్ది కేంద్రంనకు తరలించే ప్రక్రియకై రూ.42.00 కోట్లతో పనులు ప్రారంభించి పూర్తిచేయుట జరుగుచున్నది.
• సాధారణ నిధులు రూ 5.73 కోట్లతో 61 పనులు ప్రతిపాదించి పరిపాలన ఆమోదం పొంది టెండర్ ప్రక్రియ పుర్తి కాబడినవి. త్వరలో పనులు చేపట్టనున్నారు.
• 14వ ఆర్ధిక సంఘం 2015-2016 నిధులు రూ.1.38 కోట్లతో వ్యయoతో నీటి సరఫరా పెంపొందించుటకుగాను గ్యాలరి నిర్మాణం టెండర్ ప్రక్రియలో ఉందని తెలిపారు.
• 14వ ఆర్ధిక సంఘం 2019-20 నిధులు రూ.1.47 కోట్ల వ్యయంతో ఆధునిక దహన వాటిక నిర్మాణంలో ఉంది.
• 15వ ఆర్ధిక సంఘం 2019-20 నిధులతో రూ.3.33 కోట్ల వ్యయంతో 5- GTS (గార్బెజి ట్రాన్స్ఫర్ స్టేషన్) నిర్మాణము చేపట్టుటకు టెండర్ ప్రక్రియలో ఉందని అన్నారు.
• 15 వ ఆర్ధిక సంఘం 2019-20 నిధులతో రూ.93.00 లక్షలు వ్యయంతో ప్రతి ఇంటినికి మూడు డస్ట్ బీన్స్ (dustbins)పంపిణి చేపట్టుటకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించడం జరిగిందని ఆయన వివరించారు.
• శ్రీకాకుళం నగర పాలక సంస్థ పరిదిలో 4 పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల నిర్మాణాలను చేపట్టుటకు రూ.3.20 కోట్ల టెండర్ ప్రక్రియ పూర్తి కాబడి త్వరలో పనులు చేపట్టబడతాయని చెప్పారు.
1.ఆదివారంపేట - రూ.80.00 లక్షలు
2.పుణ్యపు వీధి - రూ. 80.00 లక్షలు
3.అరసవల్లి వెలమ వీధి - రూ.80.00 లక్షలు
4.దమ్మాల వీధి - రూ.80.00 లక్షలు
నగర పాలక సంస్ధ పరిధిలో :
స్వయం సహాయక సంఘాలు 2103
వై.యస్.ఆర్ ఆసరా క్రింద లబ్దిపొందిన సంఘాలు 1578
ఆసరా మొత్తం రూ. 48.70 కోట్లు
వై.యస్.ఆర్ సున్నా వడ్డీ పొందిన ఎస్.హెచ్.జిలు 1561
సున్నా వడ్డీ మొత్తం రూ. 48.49 కోట్లు
నమోదైన వీధి వర్తకులు 2983
వీధి వర్తకులకు జారీ చేసిన గుర్తింపు కార్డులు 2905
పి.ఎం.స్వానిధి క్రింద మంజూరైన రుణాలు 2103
మంజూరైన రుణాల మొత్తం రూ.2.85 కోట్లు
జగనన్న తోడు మొదటి విడతలో నమోదైన సభ్యులు 1138
జగనన్న తోడు క్రింద మంజూరైన రుణాలు 1037
వై.యస్.ఆర్ పింఛను కానుక క్రింద మంజూరైన పించన్లు 10156
ప్రతి నెల పంపిణీ చేస్తున్న పింఛను కానుక రూ.2.67 కోట్లు
వై.యస్.ఆర్ చేయూత క్రంద (45 నుండి 60 సం) ప్రయోజనం పొందిన మహిళలు 5388
మొదటి దశ చేయూత క్రింద విడుదల చేసిన మొత్తం రూ.10.10 కోట్లు
పి.ఎం.ఏ.వై క్రింద మంజూరు చేసిన గృహాలు (ఏపిటిడ్కో) 1875
పేదలందరికి ఇళ్ళ పట్టాలు క్రింద మంజూరు 10132
90 రోజుల పథకంలో ఇళ్ళ పట్టాలు మంజూరు 262
YSR సంపూర్ణ పోషణ పథకం :
శ్రీకాకుళం మరియు గార మండలం నందు గల గర్భిణీలు 1169, మరియు బాలింతలు 927, మొత్తం 2096 గాను లబ్దిదారులకు నెలకు ఒక్కంటికి 850/-రూ,, చొప్పున = 17,81,600/-లు ,6 నెలలు నుండి 3 సo,, వయస్స గల పిల్లలు 4779 గాను నెలకు 412/-రూ,, చొప్పున = 19,68,948/-లు, 3 సo.ల నుండి 6సo.ల వయస్స గల పిల్లలు 4202 గాను నెలకు 350/-రూ,, చొప్పున = 14,70,700/-లు వెరశి YSR సంపూర్ణ పోషణ వ్యయం నెలకు రూ.52,21,248/-లు వెచ్చించడం అయినది.
నాడు – నేడు ( మొదటి దశ ):
నియోజకవర్గంలో ఒక్కొక్క నూతన అంగన్వాడీ భవనం కొరకు రూ.14 లక్షలు చొప్పున 14 అంగన్వాడి కేంద్రాలకు రూ.1,96,00,000/-లు, మరామత్తులలో ఉన్న 17 అంగన్వాడి కేంద్రాలకు ఒక్కొక్క కేంద్రానికి రూ.6,90,000/-లు చొప్పున రూ.1,17,30,000/-లు వెచ్చించడమైనది.
బాలిక శిశు సంరక్షణ పథకం :
బాలిక శిశు సంరక్షణ పథకం క్రింద గత రెండు సంవత్సరలకు గాను 10,80,000/- వెచ్చియిoచడమైనది
పంచాయతీరాజ్ విభాగం :
గ్రామ సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలు, వై.ఎస్.ఆర్ ఆరోగ్య కేంద్రాలు, బల్కు మిల్కు కేంద్రాలు, సిసి రహదారులు, తారు రహదారులు చేపట్టడం జరుగుతోంది. వాటి వివరాలు
శ్రీకాకుళం మండలం పరిధిలో 312 పనులకు రూ. 46.82 కోట్లు. గార మండలం పరిధిలో 236 పనులకు రూ. 34.05 కోట్లు వెరశి 548 పనులను రూ. 80.87 కోట్లతో చేపట్టడం జరుగుతోంది.
పి.ఐ.యు ఉప విభాగం క్రింద చేపడుతున్న రహదారి పనులు :
శ్రీకాకుళం మండలం పరిధిలో 15.60 కిలోమీటర్లు గల 5 రహదారి పనులను రూ. 8.60 కోట్ల అంచనా విలువతో చేపట్టడం జరుగుతుంది. గార మండలం పరిధిలో 12.95 కిలోమీటర్లుగల 7 పనులను రూ.6.90 కోట్ల అంచనాతో చేపట్టడం జరుగుతుంది. రెండు మండలాల్లో 28.55 కిలోమీటర్లు గల 12 పనులను రూ.15.49 కోట్ల అంచనా విలువతో చేపట్టడం జరుగుతుంది.
గృహ నిర్మాణం :
గార మండలం పరిధిలో 1188 ఇళ్ళ పట్టాలు, వివిధ ప్రాంతాల్లో ఉన్న 1737 ఇళ్ళ పట్టాలు వెరశి 3057 ఇళ్ళ పట్టాలు పంపిణీ జరిగింది.
జగనన్న కాలనీలలో నీటి సరఫరా :
నియోజకవర్గంలోని జగనన్న కాలనీలలో నీటి సరఫరా కార్యక్రమం క్రింద శ్రీకాకుళం మండలం పరిధిలో 24 లేఅవుట్లలో రూ.1.35 కోట్లతో పనులు మంజూరు. గార మండలం పరిధిలో 28 లే అవుట్లలో రూ.1.25 కోట్లతో పనులు మంజూరుకాగా వెరశి 52 పనులను రూ.2.60 కోట్లతో పనులను చేపట్టడం జరిగింది.
సిసి డ్రైనేజిలు :
శ్రీకాకుళం మండలం పరిధిలో 25 పనులను రూ.7.19 కోట్లతోనూ, గార మండలం పరిధిలో 12 పనులను రూ.4.19 కోట్లతోనూ వెరశి 37 పనులు 11.38 కోట్లతో సి.సి.డ్రైనేజీ పనులను చేపట్టడం జరుగుతుంది.
రూ. 5 లక్షల లోపు విలువ గల పనులు
శ్రీకాకుళం మండలంలో 6 పనులకు రూ.22.32 లక్షలు వెచ్చించడం జరిగింది.
గార మండలంలో 71 పనులకు రూ.1.57 కోట్లు వెరశి 77 పనులు రూ.1.80 కోట్ల అంచనా విలువతో పనులను చేపట్టడం జరిగింది.
0 Comments