ప్రజా పత్రిక:రాజమహేంద్రవరం నగరంలోని ఇసుక ర్యాంప్ సమీపంలో మంగళవారం గోదావరి నదిలో ఇద్దరి యువతుల మృతదేహాలు లభ్యమయ్యాయి.
ఇవి ఎగువ ప్రాంతం నుంచి కొట్టుకు వచ్చినట్టు పోలీసులు భావిస్తున్నారు.
యువతుల వయస్సు 20 నుంచి 25 సంవత్సరా మధ్య ఉంటుందని తెలిపారు.
యువతుల మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
వారు ఆత్మహత్యకు పాల్పడ్డారా? లేక ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయారా? మరే ఇతర కారణాలతోనైనా మరణించారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
వివరాలు తెలియాల్సివుంది.
0 Comments