ప్రజా పత్రిక:నరసన్నపేట పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు ఎదురవకుండా, అలాగే కోవిడ్ కర్ఫ్యూ సమయంలోనూ పోలీసులకు స్టాపర్స్ ఎంతగానో ప్రయోజనకరంగా ఉంటాయని నరసన్నపేట ఎస్ఐ ప్రసాదరావు చెప్పారు.వైఎస్ఆర్సీపీ యువనేత, రేడియాలజిస్ట్, డాక్టర్ ధర్మాన కృష్ణచైతన్య సారధ్యంలో అత్యాధునిక సాంకేతిక ప్రమాణాలతో శ్రీకాకుళం, విశాఖలో సేవలందిస్తున్న కృష్ణా మెడికల్ సెంటర్ (కేఎంసీ) ద్వారా ఆదివారం సాయంత్రం నరసన్నపేట పోలీసు స్టేషన్ కు స్టీల్ స్టాపర్స్ డివైడర్స్ని బహుకరించారు. వీటిని ఎస్ఐ ప్రసాదరావుకు కేఎంసీ సిబ్బంది అందజేశారు. కేఎంసీ సీనియర్ వైద్యులు, ఎండి రేడియాలజిస్ట్ డాక్టర్ వి. శరత్ చంద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద (సీఎస్ఆర్ నిధులతో) పటిష్ఠమైన విశాఖ స్టీల్ తో తయారు చేసిన ఈ డివైడర్లపై హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి, సెల్ఫోన్లో మాట్లాడుతూ. డ్రైవింగ్ చేయడం నేరం.. అతివేగం అనర్ధదాయకం.. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి.. తదితర నినాదాలను రాయించినట్టు చెప్పారు. త్వరలోనే రాజాం, పలాస పట్టణాలలో కూడా పోలీసులకు వారి కోరిక మేరకు అందజేయనున్నట్టు పేర్కొన్నారు. నరసన్నపేట బస్టాండ్ సెంటర్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఎం చంద్రశేఖరరావు (చందు), కనపల లక్ష్మణ రావు, కృష్ణా మెడికల్ సెంటర్ సిబ్బంది తెలుగు తరుణ్, కె బలరాం, సూరపు జయరామ్, తదితరులు పాల్గొన్నారు.
0 Comments