విజయవాడ:శ్రీకాకుళం జిల్లాలో ఐఏఎస్ అధికారిగా కాకుండా ఒక సేవకుడిగా ఎందరో మనసులు గెలుచుకుని ఇటీవల బదిలీపై వెళ్లి కృష్ణా జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన జె.నివాస్ ను డిప్యూటీ సీఎం తనయుడు, యువ నాయకులు డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య మర్యాదపూర్వకంగా కలిశారు. కృష్ణా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బుధవారం సాయంత్రం చైతన్య తో పాటు శాసనసభాపతి తనయులు తమ్మినేని చిరంజీవి నాగ్ కూడా కలెక్టర్ ను కలిసిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా వారంతా శ్రీకాకుళం జిల్లా విశేషాలను పంచుకున్నారు. పలు అంశాలను చర్చించారు.
0 Comments