ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

కృష్ణా జిల్లా కు బదిలీపై వెళ్తున్న కలెక్టర్ నివాస్ కు నీరాజనాలు

శ్రీకాకుళం, జూన్ 8 : శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గా పనిచేసి కృష్ణ జిల్లా కలెక్టర్ గా బదిలీపై వెళ్తున్న జె నివాస్ కు ప్రజలు నీరాజనాలు పలికారు. కృష్ణా జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టుటకు మంగళవారం శ్రీకాకుళంలో బయలుదేరిన నివాస్ కు ఏడు రోడ్ల కూడలి వద్ద నాగావళి వంతెనపై లయన్స్ క్లబ్, స్టార్ వాకర్స్, ఇతర సంస్థల ప్రతినిధులు పెద్ద ఎత్తున నీరాజనం పలికారు. దారిపొడవునా జిల్లా కలెక్టర్ ముఖచిత్రంతో మా మంచి కలెక్టర్ అనే బ్యానర్లను ప్రదర్శిస్తూ పుష్ప హారతులు అందిస్తూ కలెక్టర్ నివాస్ శ్రీకాకుళం ప్రజల ఆత్మీయ అనురాగాలను చాటిచెప్పారు. నివాస్ కు పూల మాలలు వేసి శాలువతో సత్కరించి మరుపురాని అనుభూతిని మిగిల్చారు. శ్రీకాకుళం గొప్ప జ్ఞాపకాన్ని మిగిల్చిందని నివాస్ పేర్కొన్నారు. ప్రజలు, ప్రజల మనస్తత్వం ఎంతో ఊరటను ఇచ్చిందని, వారి జ్ఞాపకాలు చిరస్థాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గా పనిచేసిన కాలం జీవితంలో మధురానుభూతులుగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. ప్రజలు అందరూ జిల్లా అభివృద్ధిలో భాగస్వామ్యం అవ్వాలని, అభివృద్ధి పథంలో ముందుకు తీసుకువెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు. కష్టపడే మనస్తత్వం గల ప్రజలు ఉన్న జిల్లా శ్రీకాకుళం అన్నారు. జిల్లాతో విడదీయరాని అనుబంధం ఏర్పడిందని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు నటుకుల మోహన్, బాడన దేవ భూషణ్ రావు,  డాక్టర్ సిహెచ్ కృష్ణమోహన్, గోపి,  వాకర్స్ సభ్యులు ఎస్ జోగినాయుడు, రమణ, మల్లేశ్వర రావు,  టీవీఎస్ రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments