ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

వస్తున్న రెండు మూడు నెలలు రైతులకు కీలకం*.పెండింగ్ లో ఉన్న వైయస్సార్ చేయూత తక్షణమే పూర్తి చేయాలి.జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్

శ్రీకాకుళం, జూలై, 29: పెండింగ్ లో ఉన్న వైయస్సార్ చేయూతను తక్షణమే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ బ్యాంకర్లను ఆదేశించారు. గురువారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. బ్యాంకు మిత్రలను రైతు భరోసా కేంద్రాలతో అనుసంధాన పరచుటకు చర్యలు తీసుకోవాలని లీడ్ బ్యాంక్ మేనేజర్ ను ఆదేశించారు.  పెండింగ్ లో ఉన్న ఋణాలన్నింటిని ఆమోదించిన అర్హులైన వారికి మంజూరుకు చర్యలు తీసుకోవాలని బ్యాంకర్లకు స్పష్టం చేశారు.  జిల్లా జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ కొన్ని బ్యాంకులు ఋణాలు మంజూరు చేయడం లేదని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ఋణాలు మంజూరు కు చేసేందుకు చర్యలు తీసుకోవాలని లీడ్ బ్యాంక్ మేనేజర్ ను ఆదేశించారు.   వ్యవసాయ ఋణాలపైన జెడి శ్రీధర్ మాట్లాడుతూ రెన్యూవల్స్ చేస్తున్నారు కాని కొత్తగా మంజూరు చేయడం లేదని కలెక్టర్ దృష్టికి తీసుకురాగా కొత్త వారికి ఋణాలు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకోవాలని బ్యాంకర్లను ఆదేశించారు. టిడ్కో హౌసింగ్ పై మున్సిపాలిటీల వారీగా సమీక్షించారు. టిడ్కో తో పాటు ప్రస్తుతం నడుస్తున్న గృహ నిర్మాణంను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. జగనన్న తోడు మున్సిపాలిటీ ల్లో ఉన్న చిన్న చిన్న వ్యాపారులకు ఋణాలు మంజూరు చేయాలన్నారు. కోవిడ్ సమయంలో ఆ ఋణాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని వివరించారు. ప్రభుత్వ పథకాలు పై మండల, మున్సిపాలిటీ స్థాయిలో బ్యాంకర్లతో సమావేశం ఏర్పాటు నిర్వహించి ఋణాలు మంజూరుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎట్టిపరిస్థితిలో నిర్లక్ష్యం వహించకూడదన్నారు. వ్యవసాయ ఋణాలు మంజూరు చేయాలని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను దృష్టిలో ఉంచుకుని అర్హులైన ప్రతీ లబ్ధిదారులకు ఋణాలు మంజూరుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అనంతరం 2021-22 వార్షిక ప్రణాళిక పుస్తకాన్ని ఆవిష్కరించారు. 

ఈ సమావేశంలో జడ్పీ సీఈవో బి. లక్ష్మీపతి, ఎస్పీ కార్పొరేషన్ ఈడీ రామారావు, బిసి కార్పొరేషన్ ఈడీ రాజారావు, మెప్మా పిడి కిరణ్, మున్సిపల్ కమీషనర్లు, డిఆర్డిఎ పిడి శాంతి శ్రీ, లీడ్ బ్యాంక్ మేనేజర్ జి.వి.బి.డి.హరి ప్రసాద్, డిడి ఎం మిలింద్ చౌసల్కర్, ఎఎల్డిఎం వెంకట రమణ, ఆర్ బిఐ ఎజి సాయి చరన్, ఎస్బిఆర్ఎం తపోదమ్, ఎస్బిఐ ఆర్ఎం ఎఎ హసీమ్, రీసెటీ డైరెక్టర్లు శ్రీనివాసరావు, తిరుమల కుమార్, నాగరాజు, కోఆపరేటివ్ జిఎం జ్యోతిర్మయి, జిల్లా లీడ్ బ్యాంక్ ఆర్థిక అక్షరాస్యత కౌన్సిలర్ గిరిజా శంకర్, తదితర బ్యాంకులకు సంబంధించిన మేనేజర్లు, ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments