ప్రజా పత్రిక-శ్రీకాకుళం:శ్రీకాకుళం రిమ్స్ పారిశుధ్య కార్మికులకు మార్చి ,ఏప్రిల్, మే బకాయి వేతనాలు చెల్లించని ఏ-1ఫెసిలిటీ ముంబై యాజమాన్యం పై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని రిమ్స్ కాంట్రాక్టు అండ్ ఔట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు* ఈ రోజు ఉదయం 8 గంటలకు రిమ్స్ గేట్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా AICCTU జిల్లా కన్వీనర్ డి గణేష్, యూనియన్ అధ్యక్షలు ఆకుల శ్యామల, ప్రధాన కార్యదర్శి దమ్ము సింహాచలం మాట్లాడుతూ కరోన వారియర్స్ అని ప్రపంచ దేశాలు పారిశుధ్య కార్మికులను కొనియాడుతుంటే మూడు నెలల గా వేతనాలు లేక కుటుంబాలతో ఆర్ధికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు, ఏ-1 కాంట్రాక్టు యొక్క కాంట్రాక్టు గతనెల తో పూర్తి అయ్యినప్పటికి వేతనాలు తేల్చకుండా కార్మికుల ను కష్టాల్లో నెట్టేసి చోద్యం చూస్తున్న ఏ-1యాజమాన్యం పై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు, కోవిడ్ పేషేంట్ దగ్గర తమ ప్రాణాలకు తెగించి పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు కోవిడ్ బకాయి 9 నెలలుగా ఇవ్వకపోవడం చాలా దారుణమని తక్షణమే జిల్లా జాయింట్ కలెక్టర్ గారు జోక్యం చేసుకుని బకాయిలు చెల్లించాలని కోరారు, ఈ కార్యక్రమంలో కొర్లకోట విజయ, కోటిలింగాల రుక్మిణి, రవణమ్మ, స్వాతి,స్వప్న, కోనేటి ఈశ్వరమ్మ,పి లక్ష్మీ, కొర్లయ్య, ముకళ్ల రవణ,వసంత్, సంతోష్, సాంబమూర్తి, దువ్వు జయప్రద, సుధారాణి, దొర భారతి,రాజేశ్వరి, బొమ్మాలి రాజేశ్వరి, శ్రీను,అప్పలనాయుడు, వెంకట్రావు, చంద్రం, పొలమ్మ, గన్నెమ్మ, లుట్ట పెంటయ్య,అన్నపూర్ణ, కావ్య, రజిని,అప్పలరాజు, తదితరులు పాల్గొన్నారు.
0 Comments