ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

విద్యుత్ షాక్ తో ఆరుగురు మృతి.అనుమానాస్పదంగాకేసు నమోదు చేసిన పోలీసులు

గుంటూరు : రేపల్లె మండలం : లంకెవాని దిబ్బ :

*విద్యుత్ షాక్ తో ఆరుగురు మృతి*


జిల్లాలో విషాదం చోటు చేసుకుంది.         

రొయ్యల చెరువు దగ్గర ప్రమాదవశాత్తు విద్యుత్‌ షాక్‌తో ఆరుగురు మృతి చెందారు.                              

ఈ ఘటన రేపల్లె మండలం లంకెవాని దిబ్బలో చోటు చేసుకుంది.                

గురువారం అర్ధరాత్రి రొయ్యల చెరువు దగ్గర ఒడిశా వాసులు కాపలాగా పనిచేస్తున్నారు. 

అర్ధరాత్రి చెరువు గట్టుపై నిద్రిస్తున్న సమయంలో విద్యుత్ వైర్లు తెగిపడి ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.                

స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.               

అనంతరం మృతుల వివరాలను పోలీసులు వెల్లడించారు.             

మృతులు: రామ్మూర్తి, కిరణ్, మనోజ్, పండబో, మహేంద్ర, నవీన్ గా పోలీసులు గుర్తించారు.

Post a Comment

0 Comments