ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

భవన నిర్మాణ కార్మికులకు ఆదుకోవాలనిమాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కు వినతి

*అమరావతి*

_*తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆంద్రప్రదేశ్   భవన నిర్మాణ కార్మిక సంఘాల సంయుక్త కమిటీ సభ్యులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి వినతిపత్రం ఇచ్చారు.*_

★ ఈ సందర్భంగా జెఏసి సభ్యులు వెంకట సుబ్బయ్య, పిల్లి నర్సింహారావు, కుటుంబరావు, వెంకటేశ్వరరావు, ఆర్.మోహన్, తోరం రాజా, ఈశ్వర్,వెంకట్రావు తదితరులను రాష్ట్ర టి.యన్.టి.యు.సి అధ్యక్షులు శ్రీ గొట్టుముక్కల రఘురామరాజు చంద్రబాబు గారి వద్దకు తీసుకుని వెళ్లడం జరిగింది. 

_*జెఏసి సభ్యులు, చంద్రబాబు గారితో మాట్లాడుతూ..*_

★ గత అనేక సంవత్సరాలుగా రాష్ట్రంలో భవన నిర్మాణ సంక్షేమ బోర్డు ద్వారా భవన నిర్మాణ కార్మికులకు అనేక సంక్షేమ పథకాలు అమలు జరిగాయి.

★ 22 లక్షలకు పైగా కార్మికులు ఈ సంక్షేమ బోర్డులో సభ్యులుగా వున్నారు.

★ అర్హులైన వారికి ఈ రెండు సంవత్సరాలలో ఏ ఒక్క క్లయిమ్ కూడా ఇవ్వలేదు. 

★ నిధులు మొత్తం పక్కదారి పట్టిస్తున్నారు కాబట్టి మేము జెఏసి గా ఏర్పడి ఉద్యమం చేస్తున్నాము. 

★ మా ఉద్యమానికి మీ మద్దతు తెలియజేసి ఆగస్టు 5వ తారీఖున విజయవాడలోని ధర్నా చౌక్ లో ఏర్పాటు చేసిన నిరసన కార్యక్రమానికి కూడా రావలసిందిగా కోరారు. 

_*వీరితో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ..*_

★ ఖచ్చితంగా మీరు చేస్తున్న పోరాటానికి మా మద్దతు ఉంటుందని అన్నారు. 

★ ఈ కార్యక్రమంలో అన్ని సంఘాల నాయకులతో పాటు రాష్ట్ర టి.యన్.టి.యు.సి  ప్రధాన కార్యదర్శి రెంటపల్లి శ్యాం పాల్గొన్నారు.

Post a Comment

0 Comments