ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

అవినీతిని ఉపేక్షించేది లేదు-జిల్లా ఎస్.పి. సిద్ధార్థ్ కౌశల్.పోలీసుశాఖ ప్రతిష్టకు భంగం కలిగించిన హెడ్ కానిస్టేబుల్ సస్పెన్షన్

కృష్ణాజిల్లా మచిలీపట్నం:పోలీస్ శాఖలో పనిచేసే ఏ ఒక్క సిబ్బంది వలనైనా పోలీస్ శాఖ ప్రతిష్టకు మచ్చ తెచ్చేలా, కీర్తి ప్రతిష్టలకు భంగం వాటిల్లే లా ప్రవర్తిస్తే వారు ఏ స్థాయి అధికారి అయిన వారిపై శాఖాపరమైన చర్యలకు వెనుకాడేది లేదని తెలిపిన జిల్లా ఎస్.పి  సిద్ధార్థ్ కౌశల్ గారు. 

అవినీతి ఆరోపణలు, ప్రజలతో అమర్యాదగా ప్రవర్తిస్తున్న హెడ్ కానిస్టేబుల్ పై నేడు సస్పెన్షన్ వేటు..

పామర్రు పోలీస్ స్టేషన్ లో రైటర్ విధులు నిర్వర్తిస్తున్న  *HC-767 రాజులపాటి కిషోర్* సస్పెన్షన్..


కొద్ది రోజుల క్రితం పామర్రు పోలీస్ స్టేషన్ పరిధిలోని బల్లిపర్రు హైవే వద్ద ఒక కారు, ద్విచక్ర వాహనం రహదారి ప్రమాదంలో ఢీకొన్న సంఘటనలో పిర్యాదు చేయడానికి  పోలీస్ స్టేషన్ కు వచ్చిన క్షతగాత్రులు..

స్టేషన్ ఎస్.ఐ  బాధితుల నుండి ఫిర్యాదు స్వీకరించమని తెలిపినా వారి ఫిర్యాదును స్వీకరించని హెడ్ కానిస్టేబుల్..

అంతేకాకుండా వారి పట్ల అమర్యాదగా,అసభ్యకరంగా వారి మనోభావాలను కించపరిచేలా ప్రవర్తించిన రైటర్... 

ఈ సంఘటన ఎస్పి గారి దృష్టికి రాగా, ఆ సంఘటనపై సంబంధిత అధికారులకు ఎస్పీ గారు పూర్తి విచారణ చేసి నివేదిక సమర్పించమని ఆదేశాలు జారీ..

ఎస్ పి గారి ఆదేశాల మేరకు ఆ సంఘటనకు సంబంధించి పూర్తి సమాచారం, విచారణ జరిపి అధికారులు ఎస్.పి గారికి నివేదిక సమర్పణ.. 

వచ్చిన ఆరోపణలు నిజమేనని నిర్ధారణ చేసుకొని ఈరోజు అతన్ని సస్పెండ్ చేస్తూ జిల్లా పోలీస్ కార్యాలయం నుండి ఉత్తర్వులు జారీ...

ఇవే కాక పలు అవినీతి కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు కూడా రుజువు..

*జిల్లా ఎస్.పి సిద్దార్డ్ కౌశిల్ కామెంట్స్...*

ప్రజలకు స్నేహపూర్వక పోలీసింగ్ ను అందించాలి..

ఫిర్యాదు చేయడానికి స్టేషన్ ను ఆశ్రయించే ప్రజల పట్ల అమర్యాదగా ప్రవర్తించిన, అవినీతి కార్యకలాపాలకు పాల్పడ్డారని తెలిసిన, వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవు..

ఎంతటి వారిని ఉపేక్షించేది లేదు..

Post a Comment

0 Comments