రాష్ట్రంలోని ఠాణాలతో పాటు పోలీసు కార్యాలయాల్లో మెరుగైన సేవలందించేందుకు 5ఎస్(సార్ట్, సెట్‌ఇన్ ఆర్డర్, షైన్, స్టాండర్డైజ్, సస్టెయిన్) విధానాన్ని అమలు చేస్తున్నామని డీజీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు.
రాష్ట్రంలోని సీపీ, ఎస్పీ కార్యాలయాల అధికారులతో ఆయన బుధవారం సమావేశం నిర్వహించారు.
5ఎస్ విధానాన్ని పకడ్బందీగా అమలు చేయాలనిఅధికారులను ఆదేశించారు.
పోలీసు సిబ్బందికి రెయిన్ కోట్లు, గ్రౌండ్ షీట్లు, ఉన్ని దుప్పట్లు, స్వెటర్లు కలిగిన కిట్‌లను సకాలంలో అందజేసేందుకు ప్రత్యేక యాప్‌ను రూపొందించామని తెలిపారు.
యాప్‌లో 44,282 మంది పోలీసు సిబ్బంది వివరాలను నమోదు చేశామన్నారు.
పోలీసు కార్యాలయాల నిర్వహణపై శ్రద్ధ చూపించిన ఆర్‌ఐలకు ప్రశంస పత్రాలు అందించారు.
0 Comments