ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో మోడీ కార్మిక రైతు వ్యతిరేక విధానాలపై ఆగస్టు 9న మండల కేంద్రాల్లో నిరసన పిలుపు. సి ఐ టి యు.

శ్రీకాకుళం:క్విట్ ఉద్యమ స్ఫూర్తితో మోడీ ప్రభుత్వం రైతు కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సేవ్ ఇండియా దినముగా జిల్లా, మండల కేంద్రాల్లో ఆగస్టు 9న నిరసన కార్యక్రమాలకు సి ఐ టి యు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం పిలుపునిచ్చాయి అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్ సురేష్ బాబు మాట్లాడుతూ రైతు వ్యతిరేక మూడు నల్ల చట్టాలు, విద్యుత్ బిల్లులు రద్దు చేయాలని, కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ లను ఉపసంహరించుకోవాలన్నారు డిమాండ్ చేశారు. రైతాంగానికి మద్దతు ధర కల్పించాలని రైతాంగం ఎనిమిది నెలల నుండి ఢిల్లీలో ఆందోళన చేస్తున్న పట్టించుకోకుండా స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేయకుండా రైతాంగాన్ని దివాలా తీసే చర్యలు మోడీ గవర్నమెంట్ తీసుకొస్తుందని గుర్తు చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలు కార్పొరేట్ సంస్థలకు కారుచౌకగా అమ్మినందుకు మోడీ ప్రభుత్వం  ప్రయత్నిస్తుందని అన్నారు. పెట్రోల్ డీజిల్ గ్యాస్ నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించాలని ఆదాయ పన్ను చెల్లించిన కుటుంబాలకు నెలకి 7,500 చొప్పున ఆరు నెలల పాటు ఇవ్వాలని ప్రతి వ్యక్తికి నెలకు పది కేజీల బియ్యం ఇతర నిత్యావసర వస్తువులు సరఫరా చేయాలని అన్నారు. ఉపాధి హామీ నిధులు పెంచి గ్రామీణ ప్రాంతంలో అందరికీ పనులు కల్పించాలని పట్టణ పేదలకు ఉపాధి హామీ పథకం అమలు పరచాలని తెలిపారు . కరోనా నియంత్రణకు తోడ్పడుతున్న ఫ్రంట్లైన్ వర్కర్లకు 50 లక్షల బీమా పథకం అమలు చేయాలని కోవిడ్ వారియర్స్ అదనపు వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ  టి. తిరుపతి రావు, ఎం సూర్యనారాయణ, ఎస్ వెంకట్రావు బి.శ్రీను,పి. సంతోషి కె. ఎల్లమ్మ శశికళ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు

Post a Comment

0 Comments