శ్రీకాకుళం:శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అభివృద్ధి పెరుగుతున్న క్రమంలో పాలకవర్గాలు అశాస్త్రీయ భావజాలాన్ని పెంచుతున్నాయని జనవిజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు త్రిమూర్తులు రెడ్డి విమర్శించారు. అశాస్త్రీయత అభివృద్ధికి ఆటంకమని స్పష్టం చేశారు. నగరంలోని యుటిఎఫ్ జిల్లా కార్యాలయంలో జనవిజ్ఞాన వేదిక 16వ జిల్లా మహాసభలను ఆదివారం నిర్వహించారు. ముందుగా జనవిజ్ఞాన వేదిక పతాకాన్ని జిల్లా అధ్యక్షులు జర్జాన నీలయ్య ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన సభలో ముఖ్య అతిథిగా త్రిమూర్తులు రెడ్డి మాట్లాడుతూ జనవిజ్ఞాన వేదిక ద్వారా శాస్త్రీయ సమాజ నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. సామాన్య ప్రజానీకంలో శాస్త్ర విజ్ఞాన ప్రచారం, శాస్త్రీయ ఆలోచనా దృక్పథాన్ని పెంపొందించడమే లక్ష్యంగా జనవిజ్ఞాన వేదిక పనిచేస్తోందని చెప్పారు. రాష్ట్ర కార్యదర్శి గోపాలరావు మాట్లాడుతూ శాస్త్ర విజ్ఞాన ప్రచారం ద్వారా మూఢ విశ్వాసాలను అరికట్టాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్రజల సమస్యలకు శాస్త్రీయ పరిష్కారాలను అన్వేషించాలని సూచించారు. మహాసభల్లో జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లారెడ్డి పద్మనాభరావు, కోశాధికారి కూర్మారావు, కొత్తకోట అప్పారావు, బొడ్డేపల్లి మోహనరావు, గొంటి గిరిధర్, జి.సురేష్, బొడ్డేపల్లి జనార్థనరావు, ఎం.వాగ్దేవి తదితరులు పాల్గొన్నారు.
నూతన కమిటీ ఎన్నిక
జనవిజ్ఞాన వేదిక జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా కుప్పిలి కామేశ్వరరావు, గొంటి గిరిధర్, గౌరవాధ్యక్షులుగా కొత్తకోట అప్పారావు, బొడ్డేపల్లి మోహనరావు, జె.నీలయ్యను ఎన్నుకున్నారు. కోశాధికారిగా వి.కుమార్, ఆడిట్ కన్వీనర్‌గా పుట్టా ఉదరు కుమార్, ఉపాధ్యక్షులుగా ఎం.పద్మనాభరావు, బొడ్డేపల్లి జనార్థనరావు, పి.కూర్మారావు, ఎన్.కుమారస్వామి, పి.రవికుమార్, బోనెల గోపాల్, ఎం.వాగ్దేవి, పి.వేణుగోపాల్, ఫ్రాన్సిస్‌ను ఎన్నుకున్నారు. కార్యదర్శులుగా జి.రామారావు, ఎస్.సంజీవరావు, టి.ప్రభాకర్, జి.ప్రకాష్, ఎల్.వి చలం, ఐ.జగన్మోహనరావు, కుమార్, బి.ధనలక్ష్మి, పెంకి చైతన్య కుమార్, ఎస్.మహేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జన విజ్ఞాన వేదిక మహిళా విభాగం సమతా కన్వీనర్‌గా ఎం.వాగ్దేవి, ఆరోగ్య విభాగం కన్వీనర్‌గా డాక్టర్ శ్రీనివాస్, సైన్స్ అండ్ టెక్నాలజీ కన్వీనర్‌గా మన్మథరావు, విద్యా విభాగం కన్వీనర్‌గా ధర్మారావు, పర్యావరణం విభాగం కన్వీనర్‌గా బి.గోపాల్, చెకుముకి కన్వీనర్‌గా లక్ష్మణరావు, సోషల్ మీడియా కన్వీనర్‌గా డి.ప్రకాష్, కల్చరల్ కమిటీ కన్వీనర్‌గా కె.గౌరునాయుడు, యూత్ కన్వీనర్‌గా బి.పురుషోత్తం, పలు కమిటీల సభ్యులుగా ఉమామహేశ్వరరావు, ఎర్రమ్మ, కె.వి క్రాంతి కుమార్, పి.గోవిందరావు ఎన్నికయ్యారు
0 Comments