మహా మహిమాన్విత చరిత ను నేను
పురాణ పురుషులు పుట్టిన పునీతను
మాతలకు మాత ను భరతమాతను
సకల సంపదలకు నిలయాన్ని
సంస్కృతి సంప్రదాయాల వైభవాన్ని
స్వర్గాన్ని మరిపించు వైభోగం
అఖండ భారతాన అంతులేని ఐశ్వర్యం నాది
కళ్ళు కుట్టిన కుళ్ళుబోతులు
ఒళ్ళు మరిచి జబ్బ చరిచి
కయ్యానికి కాలుదువ్విన కల్మషాత్ముల
బెబ్బులులై బెంబేలెత్తించగ
శక్తితో గెలవలేమని కుయుక్తుల్లెన్నొ పన్ని
మనలో మనకే మంటబెట్టి
భరతమాతను బంధి చేసిరి
స్వేచ్ఛకు సంకెళ్లు వేసిరి
కంట నిప్పులు కణకణ
మండిన
వినుతికెక్కిన వీరపురుషుల
చరితకందని చరితార్థుల
త్యాగధనుల త్యాగఫలం
భరతమాత స్వాతంత్ర్య ఫలం.
జాతిపిత గాంధీజీ,చాచానెహ్రూజి నేతాజీ స్వాతంత్ర్యఉద్యమ పోరాట ఫలితం
అల్లూరిసీతారామరాజు విప్లవశంకమై,జాన్షిలక్ష్మిబాయి,రాణీరుద్రమ,సిక్కోలు గున్నమ్మ
మహిళా స్వాతంత్ర్యఉద్యమస్ఫూర్తి ఫలమే నేటి భారతదేశం..
భారతీయస్వాతంత్యం...
డా.భోగెల.ఉమామహేశ్వరరావు(ఉమాకవి)
బాలకధానిలయం వ్యవస్థాపకులు..
0 Comments