ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

శాస్త్రీయ సమాజ నిర్మాణమే జె.వి.వి.కె లక్ష్యం

శ్రీకాకుళంకల్చరల్,ఆగస్ట్15, శాస్త్రీయ సమాజ నిర్మాణమే జనవిజ్ఞాన వేదిక లక్ష్యంమని జనవిజ్ఞానవేదిక జిల్లా గౌరవఅధ్యక్షులు కొత్తకోట అప్పారావు,బొడ్డేపల్లి మోహనరావు అన్నారు.శాస్త్రవిజ్ఞానప్రచారం విస్తృతంగా చేయడానికి సభ్యులు కృషి చేయాలనిఅన్నారు.   శ్రీకాకుళం యూ.టి.ఎఫ్.భవనం లో జె.వి.వి.ప్రాంతీయ సమావేశం ఆదివారం జరిగింది.ఈ సమావేశానికి జిల్లా ఉపాధ్యక్షులు పి.వి .రవికుమార్ అధ్యక్షత వహించారు. మూఢవిశ్వాసాలను విడనాడే విధంగా విద్యార్థులు కు అవగాహన కల్పించాలని అన్నారు.పర్యావరణపరిరక్షణ,సాంసృతిక అభివృద్ధి కి జె.వి.వి కె కృషి చేస్తుందని అన్నారు.
జిల్లా ప్రధానకార్యదర్శి గొంటి గిరిధర్ మాట్లాడుతూ జె.వి.వి కె లో జిల్లా వ్యాప్తంగా సభ్యులు గా చేరి శాస్త్రీయ విజ్ఞానం పై అవగాహన కల్పించాల్సిన ఆవసరం ఉందని అన్నారు.జిల్లాలో అన్ని మండలాల్లో కమిటీలు వేసి జె.వి.వి.కె ను పటిష్టపరిచేందుకు కృషి చేస్తున్నామని అన్నారు.ఈ సమావేశంలో కోశాధికారి పి.కూర్మారావు,ఆడిట్ కన్వీనర్ భోగెల ఉమామహేశ్వరరావు,సమత ఉపాధ్యక్షురాలు ఎర్రమ్మ , గార జె .వి.వి కె అధ్యక్షులు ఎస్.ఖాలీమ్ , సోషల్ మీడియా కన్వీనర్ డి.ప్రకాశ్,మన్మధరావు,కొత్తకోట శ్రీకాంత్,పి.గోవిందరావు,హెచ్.మన్మధరావు,ఎంశ్రీనివాసరావు,గోవిందరావు,రవి తదితరులు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా జె.వి.వి.కె వాల్ పోస్టర్ల ను ఆవిష్కరించారు.

Post a Comment

0 Comments