ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

విద్యా, వసతి దీవెన పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి - ఎస్ఎఫ్ఐ

*ఎచ్చెర్ల* 
( *యూనివర్సిటీ క్యాంపస్* )

విద్యా, వసతి దీవెన పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి - ఎస్ఎఫ్ఐ

డా,, బి ఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ ఎచ్చెర్ల,  భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) యూనివర్సిటీ కమిటీ ఆధ్వర్యంలో జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన లోటు పాట్లును ప్రభుత్వo వెంటనే సరి చేసుకోవాలని యూనివర్సిటీ అధ్యక్షులు పాలం నాసరయ్య డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన మాట్లాడుతూ వసతి, విద్యా దీవెన పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని కోరారు. ముఖ్యమంత్రి  వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో విద్యార్థులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని అన్నారు. పీజీ కోర్సులు ప్రైవేట్ కాలేజ్ లో చదివే విద్యార్థులకు వసతి, విద్యా దీవెన పథకాలు లో అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. గత ప్రభుత్వం 16 లక్షలు మందికి ఫీజు రీయింబర్స్మెంటు ఇస్తే, ఈ ప్రభుత్వం 10 లక్షలు మందికి ఇవ్వటం సరికాదు అన్నారు. ప్రతి ఒక్క పేద విద్యార్థి కి వసతి, విద్యా దీవెన పథకాలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ యూనివర్సిటీ కమిటీ డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ యూనివర్సిటీ ప్రధాన కార్యదర్శి మట్టా రవి, కోశాధికారి  రాజు, సహాయ కార్యదర్శులు మోహన్ బాబు, ఆనంద్, కుమార్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments