నరసన్నపేట-ప్రజా పత్రిక:'సినీ వినీలాకాశం లో నీవు లేవు నీ పాట ఉంది' అని రచయతల వేదిక అధ్యక్షులు సదాశివుని కృష్ణ అన్నారు.సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి కి నివాళి కార్యక్రమంలో ఆయన ప్రధాన వక్తగా పాల్గొని మాట్లాడుతూ 'సిరివెన్నిల లేని లోటు మరెవరూ తీర్చలేరన్నారు.గేయానికి మణి మకుటా మాయమైన గీతాలు రచన,భాషా పరమైన పాటలకు ఆయనొక చిరునామా'అన్నారు. రచయిత సభ్యులు సీతా రామశాస్త్రి చిత్రపటానికి పూమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో రచయితలు భమిడిపాటి గౌరీశంకర్, రఘు,రామజోగిశర్మ,హరిప్రసాద్ ,మోహనరావు,దామోదరచారి,తదితరులు పాల్గొన్నారు.
0 Comments