ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

వీఆర్వోల సమస్యలను పరిష్కరించాలని వినతి.

ప్రజా పత్రిక-నరసన్నపేట: రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం వి ఆర్ వో లు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతి పత్రం నరసన్నపేట మండల  డిప్యూటీ తహశీల్దార్ హేమ సుందర్ కు అందజేశామని వీఆర్వోల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అప్పలనాయుడు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 
వీఆర్వోల ప్రధానమైన విధి భూ పరిపాలన అన్నారు.కాని కొన్ని ఇతర శాఖల పని నిర్బంధంగా వీఆర్వో లపై రుద్ది మానసిక ఒత్తిడిని కలిగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేసిన భూ ఈ సర్వే ని ప్రజల్లోకి తీసుకువెళ్లే  ప్రథాన పాత్ర విఆర్వోలదే అన్నారు. ఆ విధంగా గా బూరి సర్వే ని ప్రజల్లోకి విజయవంతంగా తీసుకెళ్తున్నారు. అయితే ప్రధాన అడ్డంకి బయోమెట్రిక్ అన్నారు.దీనివల్ల ప్రోగ్రెస్ కుంటుపడే అవకాశం ఉందన్నారు. 
ఇంకా కొన్ని విషయాలు ప్రభుత్వం ప్రతిష్ట మంటగలిసే విధంగా ఉన్నందున ప్రభుత్వ పెద్దలు ఆలోచన చేయవలసిందిగా రాష్ట్ర వీఆర్వో సంఘము ద్వారా కోరుచు న్నామన్నారు. అలాగే వీఆర్వోల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వము పెద్ద మనసుతో పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నరసన్నపేట వీఆర్వోల సంఘము అధ్యక్ష కార్యదర్శులు, వివిధ పంచాయితీల, సచివాలయ వీఆర్వోలు పాల్గొన్నారు

Post a Comment

0 Comments