అత్యంత పారదర్శకంగా ప్రభుత్వ పధకాలు అమలు.
ప్రభుత్వ సేవలు పట్ల ప్రతీ ఒక్కరూ అవగాహన కల్గి ఉండాలి.
రాష్ట్రంలో జగనన్న పాలన జనరరంజక పాలన.
ఆంధ్రప్రదేశ్ శాసన సభాపతి తమ్మినేని సీతారాం.
ఆముదాలవలస, సెప్టెంబర్ 6:
పేదల జీవితాల్లో వెలుగులు నింపే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల అమలు చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు.మంగళవారం సరుబుజ్జిలి మండలం కొండవలస గ్రామంలో రెండో రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంన్ని నిర్వహించారు. ఆయన సంబంధిత అధికారులు, మండల వైసీపీ క్యాడర్ తో పాటు పాల్గొన్నారు.ప్రజల అవసరాలు, ప్రాంతాల అభివృద్ధి, సంక్షేమం విషయంలో గుర్తెరిగి వాటిని అమలు చేస్తూ మనసెరిగిన నేతగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సేవలందిస్తున్నారని స్పీకర్ అన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగనన్న పాలన జనరంజకంగా సాగుతోందన్నారు.ఈ సందర్భంగా ప్రతి ఇంటినీ సందర్శించిన స్పీకర్... సీఎం జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నేరుగా అర్హులైన లబ్దిదారులకు అందుతున్నాయ లేదా అడిగి తెలుసుకున్నారు అదేవిధంగా వాలంటీర్ల ద్వారా పంపిస్తున్న పెన్షన్ నేరుగా ఇంటి గడప వద్ద అందుతుందా లేదా అని అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ కే బి జి సత్యనారాయణ జడ్పిటిసి సురవరపు నాగేశ్వరరావు మండల పార్టీ అధ్యక్షులు మార్కెట్ కమిటీ చైర్మన్ బెవర మల్లేశ్వరరావు, వైస్ ఎంపీపీ లావేటి అనిల్ కుమార్, పి ఎ సి ఎస్ అధ్యక్షులు కొవిలాపు చంద్ర శేఖర్, స్థానిక సర్పంచ్ లావెటి విశ్వేశ్వరరావు,బూత్ కమిటీ కన్వీనర్ మూడడ్ల రమణ మరియు వైయస్సార్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధికారులు సచివాలయం సిబ్బంది వాలంటీర్లు పాల్గొన్నారు
0 Comments