ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

నవంబర్ 1 నుండి ప్లాస్టిక్ నిషేధం అమలు. కలెక్టర్

నవంబర్ 1 నుండి ప్లాస్టిక్ నిషేధం అమలు

జిల్లాలో ప్రతీ ఒక్కరూ ప్లాస్టిక్ నిషేధించాలి.

ఫ్లెక్సీ ప్రింటింగ్ ఆపి క్లాత్ పై ప్రింటింగ్ చేయాలి

ఎవరైనా ఫ్లెక్సీ ప్రింటింగ్ చేస్తే ఫెనాల్టీ

జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్

శ్రీకాకుళం : ప్లాస్టిక్ నిషేధం నవంబర్ 1 నుండి అమలు జరుగుతుందని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ తెలిపారు. కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లాలో ప్లాస్టిక్ నిషేధం పై మున్సిపల్ కమిషనర్లు, డిపిఓ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఫ్లెక్సీ ప్రింటింగ్ యాజమాన్యంతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలపై ప్లాస్టిక్ నిషేధిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ప్రతీ ఒక్కరూ ప్లాస్టిక్ నిషేధించాలని, ఇప్పటికే మండల స్థాయిలో అధికారులు ప్లెక్సీ ప్రింటింగ్ యాజమాన్యాలకు తెలియజేయడమైన దన్నారు. అయినప్పటికీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఒక సమావేశం ఏర్పాటు చేసి అందరికీ ప్లాస్టిక్ నిషేధం పై వివరించడమైనదని చెప్పారు. 
మున్సిపల్, పంచాయతీ పరిధిలో అవగాహన కల్పించాలని, ఫంక్షన్ లు, పుట్టిన రోజులు, తదితరమైన కార్యక్రమాలకు క్లాత్ పై ప్రింటింగ్ చేయాలన్నారు. అలా చేయని ప్రింటింగ్ ప్రెస్ లకు ఫెనాల్టీ వేయడం జరుగుతుందన్నారు. 
ఫంక్షన్ లకు వినియోగదారులు ఎవరైనా ప్లాస్టిక్ పై ప్రింటింగ్ చేస్తే వినియోగదారులకు ఫెనాల్టీ ఉంటుందన్నారు. ప్రింటింగ్ క్లాత్ లేకపోతే ప్రింటింగ్ ఆపాలని చెప్పారు. రెవిన్యూ, పోలీసు, మున్సిపాల్టీలు, జియస్టీ, తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 
ఫ్లెక్సీ సరఫరా చేసే వారు ఉంటే వారి వివరాలు తెలియజేయాలన్నారు. అధికారులు ఫ్లెక్సీ లు వినియోగించరాదని ఆదేశించారు. జిల్లాలో కాకుండా వేరే జిల్లా లేదా వేరే రాష్ట్రంలో ఫ్లెక్సీ ప్రింటింగ్ వేయించే వినియోగదారులపైనా చర్యలు ఉంటాయన్నారు. ఫ్లెక్సీ యాజమాన్యం సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళామన్నారు. వాతావరణ సమతుల్యం దృష్ట్యా ప్లాస్టిక్ నిషేధిస్తున్నట్లు పేర్కొన్నారు. పాత మిషన్ ను అప్ గ్రేడ్ చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఒకసారి వినియోగించే ఫ్లాస్టిక్ నిషేదిస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో ఉన్న వేస్ట్ ను విశాఖపట్నంలో ఉన్న జిందాల్ కంపెనీకి పంపిస్తున్నట్లు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కలెక్టర్ కు వివరించారు. కాంపాక్ట్ పై తరలిస్తున్నట్లు చెప్పారు. కాంపాక్ట్ కు ఒక మున్సిపాలిటీ వద్ద వేస్ట్ చాలకపోతే మరొక మున్సిపాలిటీ ని కలుపుకొని తీసుకువెల్లాలని కలెక్టర్ ఆదేశించారు. మున్సిపాలిటీల్లో యుపిహెచ్ ల నిర్మాణాలు ఎంత వరకు వచ్చింది అడిగి తెలుసుకొని సత్వరమే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని కమీషనర్లను ఆదేశించారు. డంపింగ్ యార్డులపైన చర్చించారు. 
      ఈ సమావేశంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ శంకర్ నాయక్, డిపిఓ రవి కుమార్, జడ్పీ సీఈవో వెంకటరామన్, పరిశ్రమల శాఖ ఉప సంచాలకులు ఉమామహేశ్వరరావు, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చల్లా ఓబులేసు, మున్సిపల్ కమిషనర్లు రాజగోపాల్, రవి సుధాకర్, మున్సిపల్, పంచాయతీ పరిధిలో గల ఫ్లెక్సీ ప్రింటింగ్ యాజమాన్యం, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

1 Comments