- పోలాకి, నవంబర్ 1:
మండలంలోని చీడికూడి పంచాయతీ కొత్తరేవు గ్రామానికి చెందిన 20 కుటుంబాల టీడీపీ మద్దతుదారులు మంగళవారం వైఎస్ఆర్సీపీలో చేరారు. మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ సమక్షంలో అడ్ల శ్రీను ఆధ్వర్యంలో వీరంతా పార్టీ మారారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం చేస్తున్న కృషి, అందిస్తున్న సుపరిపాలన ఇలాగే కొనసాగాలని వారు ఆకాంక్షించారు. మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ సమక్షంలో ఇలా వైఎస్ఆర్సీపీలో చేరడం ఎంతో సంతోషంగా ఉందని వారు తెలిపారు. వారికి పార్టీ కండువా వేసి కృష్ణదాస్ సాదరంగా ఆహ్వానించారు.
0 Comments