ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

నరసన్నపేట సిటిజన్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో వైద్య శిబిరం.

నరసన్నపేట సిటిజన్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో వైద్య శిబిరం.
.................................................

పౌర సంక్షేమం, ఆరోగ్యం కోసం నరసన్నపేట సిటిజన్ వెల్ఫేర్ సొసైటీ ఎంతో కృషి చేస్తుందని మేజర్ పంచాయితీ 
నరసన్నపేట మాజీ సర్పంచ్ పుచ్చల విశ్వేశ్వరరావు అన్నారు. శనివారం పసారువీధి విజ్ఞాన్ విద్యానికేతన్ స్కూల్ ప్రాంగణంలో జేమ్స్ హాస్పిటల్ రాగోలు వారి సౌజన్యంతో వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా జేమ్స్ హాస్పిటల్ వైద్యులు మురళీకృష్ణ ,షీలా, ఎస్ నమ్రత లు సుమారు 250 మందికి రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులను ఉచితంగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నరసన్నపేట సిటిజన్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు సువ్వారి మురళీధర్ రావు, సెక్రటరీ మార్పు విజయ్ కుమార్ , సంయుక్త కార్యదర్శి కాశిన రమేష్, సభ్యులు రోణంకి కృష్ణం నాయుడు, ఇప్పిలి జగన్నాథరావు మాస్టారు, జగ్గారావు, కింజరాపు ముసలినాయుడు, నరసింహమూర్తి , మాధవరావు , పంగ జనార్దన్ రావు , ఎస్ ఆనందరావు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments