ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

"విజయ్" సేవలు ఎందరికో ఆదర్శం కావాలి.

"విజయ్" సేవలు ఎందరికో ఆదర్శం కావాలి.
నరసన్నపేట:సమాజానికి ఏదో తమవంతు మంచి చేయాలనే తలంపుతో ముందుకు వచ్చి, నరసన్నపేట పట్టణంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మార్పు విజయ్‌ మిత్రబృందం సేవలు అందరకీ ఆదర్శం కావాలని ఆర్‌.ఎస్‌.ఎస్‌, రిటైర్డ్‌ ఎంప్లాయిస్‌, బార్‌ అసోషియేషన్‌ సంఘాల ప్రతినిధులు ఆకాంక్షించారు. బుదవారం నరసన్నపేట సబ్‌ రిజిష్ట్రారు కార్యలయం ఎదురుగా, కోర్డు ప్రహరీ పక్కన మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఇంతకు ముందు ఈ ప్రదేశంలో పిచ్చి మొక్కలు, చెత్తా చెదారం అలముకుని ఉండేది. అటువంటి దాన్ని ప్రోక్లెయినర్‌తో పరిశుభ్రం చేసి, ప్రహరీగోడకు రంగులు వేసి, రోడ్డుపై ఉన్న గుంతల ను పూడ్చిపెట్టి అందమైన బృందావనంలా తీర్చిదిద్దా రు. అంతటితో ఆగకుండా అందమైన పూల మొక్కల ను నాటే కార్యక్రమాన్ని తలపెట్టారు. నరసన్నపేట పట్టణం ప్రముఖంగా ఆర్‌.ఎస్‌.ఎస్‌ రిటైర్డు ఎంప్లా యిస్‌ యూనియన్‌ ప్రతినిధులను, కోర్టు బార్‌ అసోషియేషన్‌ సభ్యులు గౌరవ ప్రదంగా పిలచి మొక్క లను నాటింపజేసారు. ఈ సందర్భంగా ఆర్‌.ఎస్‌.ఎస్‌ ,రిటైర్డ్‌ ఎంప్లాయిస్‌, బార్‌ అసోషియేషన్‌ సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ మార్పు విజయ్‌ మిత్ర బృందం చేస్తున్న సేవా కార్యక్రమాలు ఎందరికో మార్గ దర్శకంగా ఉన్నాయన్నారు. మండు వేసవిలో ఎండ తాపాన్ని తీర్చే చలివేంద్రం ద్వారా మజ్జిక పంపిణీ నుం డి, సబ్‌ రిజష్ట్రారు కార్యలయం ముందు చెత్త చెదా రాన్ని పరిశుభ్రంచేసి గాంధీ విగ్రహం ఏర్పాటుచేసి పక్కనే మొక్కలు నాటించడం, అలాగే జైలు రోడ్డు పక్కన బాగుచేసి అక్కడ కూడా మంచి మొక్కలు నాటి ఆహ్లాదకరంగా తయారు చేయడం వంటి మంచి కార్యక్రమాలు చేపట్టం చాలా సంతోషదాయకమన్నా రు. అలాగే పాత బస్టాండ్‌ కంబకాయ రోడ్డు నుండి గాంధీనగర్‌ `1 రోడ్డు వరకూ సిసి రోడ్డున గుంతలను సిసితో కప్పి వాహనదారులకు ఎంతో మేలు చేయడం కూడా మంచి కార్యక్రమని వీరు అన్నారు. ఇలా సేవా కార్యక్రమాల పరంపర భవిష్యత్తులో కూడా కొన సాగించాలని వీరు ఆకాంక్షించారు. ఈ మొక్కలు నాటే కార్యక్రమానికి రిటైర్డు ఎంప్లాయిస్‌ యూనియన్‌ అధ్య క్షులు సదాశివుని ప్రభాకరరావు, బార్‌ అసోషియేషన్‌ అధ్యక్షులు కొంక్యాన జగన్మోహనరావు, గొండు సత్య న్నారాయణ, ఆర్‌.ఎస్‌.ఎస్‌ ప్రతినిధులు కె. లక్ష్మణ రావు, బండి ధర్మారావు, కస్పా ప్రసాదరావు, జామి రామచంద్రరావు, కోరాడ రామచంద్రరావు తో పాటు స్థానిక పెద్దలు సదాశివుని క్రిష్ణ, టంకాల గౌతమ్‌, పట్నాన నాగేశ్వరావు, రావాడ రామారావుతో పాటు సం ఘ సేవాభిలాషి మార్పు విజయ్‌కుమార్‌ స్నేహ బృందం బోడాల ఠాగూర్‌, సుధా శ్రీనివాస్‌, గా యిత్రి విష్షు, వైశ్యరాజు పకీర్‌, తూముల శ్రీను, చిట్టి సింహాచలం, గొద్దు చంద్రమౌళి, కోణార్క్‌ జానీ, బుద్దల రాజశేఖర్‌, వారణాశి నాగరాజు, గెంబలి సుధ, పెదిరెడ్ల నాగేశ్వరరావు, పొట్నూ రు సుధా శ్రీనివాస్‌, పంగ జనార్ధనరావు, రాము, సూరిబాబు, సూర్య నారాయణ, సురేష్‌, చిన్న, ఎండు, శిమ్మన్న, శిమ్మయ్య, విశ్వనాధం, ముద్దా డ జగన్నాధం, సింహాచలంతో, వైశ్యరాజు రమే ష్‌, గెంబలి నరేష్‌, వువ్వాడ షన్ముఖ, సాంబ, రమణ, గుప్త, పాటు మార్పు విజయ్‌ అభిమా నులు పలు గ్రామాలు నుండి వచ్చి ఈ కార్యక్ర మంలో పాల్గొన్నారు.

Post a Comment

0 Comments