ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

పీఎం, సీఎం సభ విజయవంతం- కృతజ్ఞతలు తెలిపిన ధర్మాన కృష్ణదాస్

శ్రీకాకుళం, నవంబర్ 12:విశాఖపట్నంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిల పర్యటన విజయవంతమైందని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం జిల్లా పార్టీ కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదల చేస్తూ  ఆంధ్ర విశ్వవిద్యాలయంలో జరిగిన బహిరంగ సభని జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. జిల్లా నుంచి విశేష సంఖ్యలలో హాజరైన వైఎస్ఆర్సీపీ నాయకులు, పార్టీ ప్రజా ప్రతినిధులు, అలాగే ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న వారందరికీ పేరుపేరునా అభినందనలు, కృతజ్ఞతలని కృష్ణదాస్ తెలిపారు .

Post a Comment

0 Comments