ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

జగన్ పై ప్రజా మోజుకు నిదర్శనం మోడీ సభ

విశాఖపట్నంలో శనివారం జరిగిన ప్రధానమంత్రి నరేంద్రమోడీ గారి బహిరంగ సభకు విచ్చేసిన అసంఖ్యాఖ జనప్రభంజనం సీఎం జగన్మోహన్ రెడ్డి పై ఉన్న భక్తి విశ్వాసలుకు నిదర్శనం అని శిష్టకరణం కార్పొరేషన్ డైరెక్టర్ సదాశివుని కృష్ణ అన్నారు. నరసన్నపేట లో శనివారం మధ్యాన్నం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.  ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి ప్రసంగంలో రాష్ట్ర అభివృద్ధి ఏకైక ఏజండగ ప్రశాంగించిన తీరు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వల అనుబంధము గూర్చి వివరించటం ద్వారా రాష్ట్ర అభివృద్ధిపై  పార్టీలకి అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారికున్న ఆకాంక్ష విధితమవుతుందని డైరెక్టర్ కృష్ణ అన్నారు. కేవలం నాలుగురోజులు వ్యవధిలో లక్షలాది మంది జానసమీకరణ జరిగేలా సభ విజయవంతం చేయటంలో ఉత్తరాంద్ర వైసీపీ నాయుకులు, వైసీపీ పార్లమెంట్ ఫ్లోర్ లీడర్ విజయసాయిరెడ్డి గారు కృతకృత్యులయ్యారని ఆయన అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ సభ రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగ పడుతుందని, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదాకోసం మరోసారి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు విజ్ఞప్తి చేయటం ద్వారా ప్రత్యేక హోదాఘట్టం మొగుసిపోలేదని సదాశివుని కృష్ణ అన్నారు. సమావేశంలో ఆయనతో పాటు, విశ్రాంతి ఉద్యోగసంఘ అధ్యక్షులు సదాశివుని ప్రభాకరరావు, ప్రతినిధి రాఘ లు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments