ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

*అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు**రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి**జిల్లాలో 43797 లబ్ధిదారులకు 1685 లక్షలు**రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు*

*అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు*

*రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి*

*జిల్లాలో 43797 లబ్ధిదారులకు 1685 లక్షలు*

*రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు*

శ్రీకాకుళం,జనవరి,11: అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందుతాయని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. బుధవారం జగనన్న తోడు, ఫేస్-VI ఋణాల పంపిణీ మరియు లబ్దిదారులకు వడ్డీ జమ కార్యక్రమాన్ని ఆయన వర్చ్యువల్ విధానంలో లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేశారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో చిరు వ్యాపారులు  రుణాలు తీసుకొని సకాలంలో రుణాలు చెల్లించిన వారికి తిరిగి జగనన్న తోడు పథకాన్ని అందిస్తున్నట్లు పేర్కొన్నారు.  ఏ ఒక్కరి మీద ఆధారపడకుండా జగనన్న తోడు లబ్ధిదారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, స్వయం ఉపాధిగా ఉపయోగపడుతుందని తెలిపారు. ఏ ఒక్కరికీ సెక్యూరిటీ లేకుండా ప్రభుత్వమే హామీ ఉంటుందని వివరించారు. లబ్దిదారులు బ్యాంకు ఖాతాలకు నేరుగా జమచేయండం జరుగుతుందన్నారు. అట్టడుగున ఉన్న ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ, తదితర అక్క చెల్లెమ్మలకు అందించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. చిరు వ్యాపారం చేసుకుంటున్న అక్క చెల్లెమ్మలలో ఎవరైనా అర్హత ఉండీ జగనన్న తోడు అందకపోతే అధికారులను సంప్రదించి  తిరిగి పొందవచ్చన్నారు. ఈ పథకం అవకాశం ఉన్నంత వరకు ఎక్కువ మందికి అందే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను కోరారు.  దీని వలన అందరి జీవన ప్రమాణాలు మెరుగుపడి జీవితాలు మారాలన్నారు. 
రాష్ట్రవ్యాప్తంగా తోపుడు బళ్లు, సాంప్రదాయ వృత్తి కళకారులు, ఫుట్పాత్ లపైన, ప్రజా, ప్రైవేట్ స్థలాల్లో తోపుడు బండ్లపై వ్యాపారాలు చేసుకుంటున్న వారు, తల మీద గంపలో వస్తువులు మోస్తూ అమ్ముకునే వారు, సైకిల్, మోటార్ సైకిల్, ఆటోలపై వెళ్లి వ్యాపారం చేసుకుంటున్న వారు, చేతి వృత్తిదారులు, కళాకారులు, తదితర వ్యాపారులు తమ రోజువారీ వ్యాపార మూలధనం కోసం ప్రైవేట్ వ్యక్తులు, వడ్డీ వ్యాపారులు దగ్గర అప్పు తీసుకొని దానిపై రూ.3/- ల నుండి రూ.10/-లు వరకు అధిక వడ్డీ చెల్లిస్తున్నారన్నారు.  సాంప్రదాయ కళాకారులతో సహా చిన్న వ్యాపారులు, వీధి వ్యాపారుల ఆదాయాలను స్థిరీకరించడం ద్వారా, ప్రైవేట్, వడ్డీ వ్యాపారులపై ఆధారపడకుండా, వారి ఆదాయాలను మెరుగుపరచడానికి రూ.10,000/-లు సున్నా వడ్డీ రుణాలు అందిస్తున్నట్లు వివరించారు. 

రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ జగనన్న తోడు పథకంతో చిరు వ్యాపారులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. జగనన్న తోడు 2022-23 ఆర్థిక సంవత్సరం ఫేస్-VI ఋణాల పంపిణీ, లబ్దిదారులకు వడ్డీ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. 
అర్హులైన ప్రతీ ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందుతాయని చెప్పారు.   జిల్లాలో 43 వేల 797 లబ్ధిదారులకు 1685 లక్షల 73 వేల రూపాయలు అందిస్తున్నట్లు వివరించారు.  

జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ మాట్లాడుతూ జిల్లాలో బ్యాంకు ద్వారా రుణం పొందిన 27 వేల 521 మంది లబ్ధిదారులకు 58 లక్షల రూపాయలు వడ్డీ వచ్చినట్లు వివరించారు. జిల్లాలో 43 వేల 797 మంది లబ్ధిదారులు ఉండగా 1685 లక్షల రూపాయలు లబ్ధి దారులు లబ్ధి పొందుతున్నట్లు ముఖ్యమంత్రికి వివరించారు. 

నరసన్నపేట మండలం నరసన్నపేట గ్రామానికి చెందిన లబ్ధిదారురాలు అంపిలి మాధురి 
గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి నాయొక్క హృదయ పూర్వక నమస్కారములు నమస్తే జగనన్న నా పేరు అంపిలి మాదురి శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం నరసన్నపేట గ్రామం నుంచి వచ్చాను అన్నా!
ముందుగా మా చిరు వ్యాపారులుకు మీరు అందిస్తున్న ఆర్ధిక సహాయం ఒకటి కాదు, మా చిరు వ్యాపారుల ఆత్మ గౌరవాన్ని కాపాడుతున్నందుకు మీకు దన్యవాదాలు తెలుపుకుంటున్నాను.

ఎందుకంటే నేను టైలరింగ్ చేస్తూ, టైలరింగ్ మెటీరియల్ అమ్ముకోవడానికి గతంలో రూ.10,000/-లు వడ్డీకి అప్పు తీసుకున్నాను ఆ పది వేల రూపాయలలో రూ.1000/-లు ముందుగానే వడ్డీ దారులు ముందుగానే తీసుకొని రూ.9000/-లు మాత్రమె ఇచ్చేవారు. అంతే కాకుండా ప్రతీ రోజు సాయంత్రం రూ.200/- లు వాయిదా కట్టమని నా కొట్టు ముందు నిలబడి వసూలు చేసేవారు, ఈ విధంగా ప్రతీ రోజు రూ.200/-లు కట్టలేక మేము చాలా ఇబ్బంది పడుతూ మానసింగా వత్తిడికి గిరి అయ్యేవారము. అలా అని బ్యాంకు నుంచి ఋణం తీసుకుందాము అనుకుంటే మా చిరు వ్యాపారులకు బ్యాంకు వారు ఋణం ఇచ్చేవారు కాదు, కాని మీరు నవరత్నాల అమలులో భాగంగా మీ దయవలన మా చిరు వ్యాపారులకు జగనన్న తోడు రుణాలను బ్యాంకుల నుండి ఇప్పించడం వలన నేను రూ.10,000/-లు జగనన్న తోడు వడ్డీ లేని ఋణం బ్యాంకు నుంచి పొంది సంతోషంగా నా వ్యాపారం నడుపుకుంటూ రోజుకు సుమారు రూ.400/-లు చొప్పున నెలకు రూ.8,000/-లు నుండి రూ.12,000/-లు వరకు సంపాదించుకుంటున్న ట్లు వివరించారు.  జగనన్న తోడు పథకాన్ని ప్రవేశపెట్టినందుకు గాను మీకు ముందుగా
కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము అన్నా!

'ఈ జగనన్న తోడు అనే పథకం ద్వారా నేను అయిదవ విడతలో రూ.10,000/-లు రుణాన్ని పొంది టైలరింగ్ రియాల్ కొని అమ్మడం జరిగేదని, అదే విధంగా ఇప్పుడు ఆరవ విడతలో వచ్చే డబ్బులతో ఆ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవాలని అనుకొంటున్నాను. దీనికి మీకు ధన్యవాదాలు తెలియుజేసుకుంటున్నాను అన్నా.  ఇందులో భాగంగా మాకు ఋణాలను అందిస్తూ ఆ రుణాలకు కట్టిన వడ్డీ మొత్తాన్ని మీరు తిరిగి మా వ్యక్తి గత ఖాతాలకు చెల్లిస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉందన్నా.  ఇందుకు మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము అన్నా. 
   ఇదే విధంగా నాలాంటి ఎంతో మంది అక్క చెల్లెమ్మలకు, వీధిలలో తోపుడు బండ్లపై కాయకూరలు, పండ్ల వ్యాపారం, రోడ్డు ప్రక్కన టీ, టిఫిన్ కొట్టు, మొదలైన చిరువ్యాపారాలు చేసుకుంటూ ఆదాయం సంపాదించుకుంటున్న మన అక్క చెల్లెమ్మల ఆత్మ గౌరవాన్ని కాపాడి నందుకు మీకు చాలా ఋణ పడి ఉన్నామన్నా.
అంతే కాకుండా నేను జగనన్న తోడు పథకంతో పాటు వై.ఎస్.ఆసరా కుడా పొందియున్నాను అన్నా.. మాది విశాలాక్షి స్వయం శక్తి సంఘం, మా సంఘానికి 2,00,000/-లు ఆసరా వచ్చిందని, అందులో భాగంగా నాకు ఒక్క విడతకు రూ. 5000/-లు చొప్పున రెండు విడతలలో రూ.10000/- లు అందింది అన్నా. అలాగే సున్నా వడ్డీ పథకం కుడా పొందియున్నాను.   అంతే కాకుండా నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు అన్నా.  వారిలో చిన్న పాపకు అమ్మ ఒడి పథకాన్ని రెండు సంవత్సరాల నుండి పొందుతున్నాను అన్నా. ఈ డబ్బులు పిల్లల విద్యకు అవసరమైన ఖర్చులకు ఉపయోగిస్తున్నాను అన్నా !

నాకు వై.ఎస్.ఆర్. పెన్షన్ కానుక పథకం క్రింద ఒంటరి మహిళా పెన్షన్ ప్రతి నెల 2500/-లు ఇస్తూ ఈ నెల నుంచి రూ.2750/-లు ఇస్తున్నారన్నా! అదే విధంగా మా అమ్మ గారికి కూడా వృద్ధాప్య పించను వస్తున్నది అన్నా!

అన్నా నా భర్త నుండి విడిపోయిన తర్వాత అమ్మగారి ఇంటి వద్దనే ఉంటూ ఏ విధంగా పిల్లలను పోషించాలో తెలియని నాకు ఈ ఒంటరి మహిళా ఫించను ఇవ్వడం ద్వారా నాకు ఒక అన్నగా, నా పిల్లలకు మేనమామగా మాకు ఒక జీవనాధారం చూపించారన్నా ! 

మీరు ప్రవేశపెట్టిన నాడు - నేడు కార్యక్రమంనకు ముందు వేలకు వేలు రూపాయలు ఫీజులు కట్టి చదివిస్తున్న మా పిల్లలను ప్రభుత్వ స్కూల్స్ కి తిరిగి తెచ్చి చేర్చించామన్నా. ఇందువలన మా పిల్లలు మీరు పెట్టిన భోజన వసతలకు, సౌకర్యాలకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఇందుకు మా తల్లల అందరి తరుపున మీకు ధన్యవాదములు తెలుపుతున్నామన్నా. అదేవిధంగా మాకు ఏ సర్టిఫికేట్స్ కావాలన్నా ఉదాహరణకు కుల, ఆదాయం, పాస్ బుక్స్ మొదలగునవి ఏమి చేయించుకోవాలన్నా రెవిన్యూ డిపార్ట్మెంట్ చుట్టూ తిరిగేవాళ్ళమన్నా అలాంటిది మీరు పెట్టిన సచివాలయ సిబ్బంది ద్వారా ఊరు దాటకుండానే సర్టిఫికేట్స్ పొందుతున్నామన్నారు.
  అదే విధంగా మీరు ప్రవేశ పెట్టిన జగనన్న కాలని ద్వారా స్థలం మంజూరు అయినది. అందులో ఇళ్ళు కట్టుకోడానికి ప్రభుత్వం 1,80,000/- రూపాయలు మంజూరు చేయడం జరిగిందని, ఆ డబ్బులతో ఇళ్ళు కట్టుకోవడం  జరిగిందని వివరించారు. ఇంకా గృహప్రవేశం చేయవలసి ఉన్నది అన్నా మాకు ఒక నీడ కల్పించినందుకు అందుకు మీకు ధన్యవాదాలు అన్నా.  ఆ ఇంలాంటి పధకాలను నాతో పాటు ప్రతి ఒక్క మహిళా పొందుతుంది అన్నా. నా లాంటి ఆడపడుచులందరు  ఇంతటి సహకారాన్ని పొందుతూ కుటుంబానికి 'కుడిబుజంలా వున్నారంటే దానికి కారణం మీరే అన్నా. మీలాంటి సియం  ముఖ్యమంత్రిగా మళ్ళీ మళ్ళీ ముఖ్యమంత్రిగా రావాలని మా అక్కచెల్లమ్మల అందరి తరుపున మాట ఇస్తున్నానన్నా. మీరే మాకు సియం గా మళ్ళీ వస్తారని ఆశిస్తూ ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరికి నా యొక్క దన్యవాదములు తెలుపుకుంటూ సెలవు తీసుకొంటున్నాను. 
అనంతరం లబ్ధిదారులకు నమూనా చెక్కులను అందజేశారు.   ఈ కార్యక్రమంలో మాజీ ఉప ముఖ్యమంత్రి, నరసన్నపేట శాసన సభ్యులు ధర్మాన కృష్ణదాస్, పాతపట్నం శాసన సభ్యులు రెడ్డి శాంతి, డిసిసిబి అధ్యక్షలు కరిమి రాజేశ్వరరావు, అందవరపు సూరిబాబు, కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, డిఆర్డిఎ పిడి విద్యాసాగర్, మెప్మా పిడి కిరణ్ కుమార్, లబ్దిదారులు, తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments