ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

పవన్ రాజకీయ వ్యభిచారి !- మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్

నరసన్నపేట, జనవరి 13: 
ఒంటరిగా పోటీ చేయడానికి దమ్మూ, ధైర్యం, వెన్నెముక లేని రాజకీయాలు చేసే పవన్ కళ్యాణ్ తన ప్రగల్బాలను కట్టి పెట్టాలని మాజీ డిప్యూటీ సీఎం, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ హితవు చెప్పారు. శుక్రవారం ఈమేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఓ వైపు బీజేపీతో పొత్తులో ఉండి మరోవైపు టీడీపీతో అంటకాగుతున్న పవన్ బరి తెగింపు రాజకీయం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీతో సంసారం చేస్తూ, టీడీపీకి కన్ను కొట్టడాన్ని రాజకీయ వ్యభిచారం అంటారన్నారు. రణస్థలం  సభలో పవన్ కల్యాణ్ చెప్పిన మాటల్లోనే అతని బలహీనత ఏమిటో తేటతెల్లమయ్యిందని తెలిపారు. మరోసారి ఒంటరిగా ఎన్నికలకు వెళ్లి వీరమరణం పొందలేనని పవన్ చెప్పారని, అంటే ఆయన సత్తా ఏమిటో ప్రజలకు అర్ధమైంది. గత ఎన్నికల్లో రెండు చోట్లా పోటీచేసి ఎక్కడా గెలవలేకపోయిన పవన్ కళ్యాణ్ తనకు తానే అధికంగా అంచనా వేసుకుంటూ నోరు పారేసుకుంటున్నారని తెలిపారు. ఒక్కసీటూ  గెలవలేని పవన్ కళ్యాణ్ ధర్మాన కుటుంబంపై నోరుపారేసుకోవడం అతని వాచాలత్వాన్ని బయట పెడుతోందన్నారు. సుదీర్ఘకాలం మంత్రులుగా, డిప్యూటీ సీఎంగా ధర్మాన కుటుంబం రాష్ట్ర రాజకీయాల్లో తమదైన ముద్ర వేసిందని,  అలాంటివారిని తన నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే జనమే మళ్లీ బుద్ధి చెబుతారని హెచ్చరించారు.  తానెందుకు చంద్రబాబు సంకలో దూరాల్సి వస్తుందో చెప్పడానికే పవన్ ఈ సభ ఏర్పాటు చేశారని, యువతకు ఉద్యోగాలు, ఉపాధి అంతా వట్టిదేనని పేర్కొన్నారు. ఒంటరిగా పోటీ చేసినా, పొత్తులతో పోటీకి దిగినా ఎన్నికల్లో చిత్తయ్యే పపన్ కళ్యాణ్ తన పరిధిని దాటి చేస్తున్న ప్రగల్బాలకు అతి త్వరలో జనమే మళ్లీ గుణపాఠం చెప్పనున్నారని ధర్మాన కృష్ణదాస్ హెచ్చరించారు.

Post a Comment

0 Comments