నరసన్నపేట:నరసన్నపేట శిష్టకరణ పేదలకు సంక్రాంతి పండగ పురస్కరించుకుని శనివారం నిత్యావసర సరుకులను శిష్టకరణ బీసీ కార్పొరేషన్ డైరెక్టర్, శిష్టకరణ సంక్షేమ సంఘము అధ్యక్షులు సదాశివుని కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక రఘుపాత్రుని బాలకృష్ణ పట్నాయక్ ,విజయలక్ష్మిల జ్ఞాపకార్ధం వారి కుమారులు రమేశ్ ,చంటి ,బుజ్జి ,లు ఈ సరకులును సమకూర్చారన్నారు.పేదరికం పూర్తిగా నిర్మూలించేందుకు జగన్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు చేస్తుందని ,వాటిని వినియోగించుకొని ,పేదరికం నుండి బయటకు రావాలని కోరారు.ఈ కార్యక్రమంలో శిష్టకరణ నాయకులు ,సదాశివుణి ప్రభాకరరావు ,అంపలాం వసంత కుమార్ ,కుప్పిలి వైఖుంట రావు ,ఉరిటి జగన్నాధరావు ,బలివాడ రాము ,చౌదరి రవికుమార్ ,తదితరులు పాల్గొన్నారు.
0 Comments