ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

వేరుశెనగ సమగ్ర సాగు, యాజమాన్య పద్ధతులపై అవగాహన

పోలాకి:క్షేత్ర దినోత్సవం సందర్భంగా ఆముదాలవలస కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డా.భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో వేరుశనగ సమగ్ర సాగు యాజమాన్య పద్ధతులపై పోలాకి మండలం కుసుమపొలవలస రైతులకు అవగాహన కలిగించారు.రైతులు నూనె గింజల పంటలలో సమగ్ర యాజమాన్య పద్ధతులు ఆచరిస్తూ అధిక దిగుబడులు పొందేలా వ్యవసాయం సాగు చేయాలన్నారు.అదేవిధంగా ఉత్పత్తులకు విలువాదారిత యంత్రాలను వాడుతూ అధిక లాభాలు పొందాలన్నారు. కృషి విజ్ఞాన కేంద్రము విస్తరణ శాస్త్రవేత్త డా.ఎస్ నీలవేణి మాట్లాడుతూ వేరుశనగ సాగు లో అన్ని సమగ్ర యాజమాన్య పద్ధతిలో పాటించాలన్నారు.వేరుశనగలు నిడువు చాళ్ళలో విత్తనం వేయడం వల్ల కావాల్సిన సాంద్రతలో మొక్కలు ఉండి అధిక దిగుబడిని పొందడానికి ఎక్కువ అవకాశం ఉంటుందని తెలియజేశారు. ఏడి రవీంద్ర భారతి మాట్లాడుతూ వేరుశనగలోని,ఇతర పంటలు సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటిస్తూ.. రైతులందరూ రైతు భరోసా కేంద్రాలు సేవలను కూడా వినియోగించుకోవాలని  సూచించారు. పోలాకి ఏఓ మాట్లాడుతూ వేరుశనగలు అధిక దిగుబడులు పొందుటకు జిప్సం వాడడం అవసరమని తెలియజేశారు.అదేవిధంగా నూతన రకాలైన నిత్య హరిత కదిరి లేపాక్షి వంటి రకాలను రైతులు వేసుకోవాలని తెలియజేశారు.శ్రీ లక్ష్మీ నారాయణ పొలంలో ఆయన అనుభవాలను కూడా కుసుమపాలవలస గ్రామ రైతులకు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో రైతు భరోసా కేంద్ర విఏఏలు, గ్రామ అభ్యుదయ రైతులైన లక్ష్మీనారాయణ చంద్రశేఖర్,మొదలగు రైతు సోదరులందరూ పాల్గొన్నారు.

Post a Comment

0 Comments