శ్రీకాకుళం, జూలై 15: ఈ నెల 22న ప్రత్యేక లోక్అదాలత్ నిర్వహిస్తామని శ్రీకాకుళం జిల్లా ప్రధాన న్యాయమూర్తి జువైడ్ అహ్మద్ మౌలానా అన్నారు. శనివారం ప్రత్యేక లోక్అదాలత్ కు సంబంధించి వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో జిల్లా న్యాయస్థానం సమావేశ మందిరంలో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక లోక్అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాజీకి గుర్తించిన కేసులు పరస్కారానికి న్యాయవాదులు, కక్షిదారులు సంపూర్ణ సహకారాన్ని అందించాలన్నారు. ఇన్సూరెన్స్ కేసులు, రహదారి ప్రమాదపు కేసులు, భూ సేకరణ చట్టం కింద కేసులు ఈ ప్రత్యేక లోకదాలతో రాజీ చేస్తారని న్యాయస్థానాలు తీర్పు కంటే సత్వర న్యాయం ఖర్చు లేని న్యాయం అందాలి అంటే ఒక్క లోక్అదాలత్ మాత్రమే సామాన్యులు,పెద్దలు అనే తేడా లేకుండా శీఘ్ర మైన న్యాయాన్ని ఇస్తాయని జిల్లా జడ్జి స్పష్టం చేశారు. ఈ అవగాహన సమావేశంలో శ్రీకాకుళం నగర పాలక సంస్థ కమీషనర్ చల్లా ఓబులేష్ తదితరులు పాల్గొన్నారు. ఇంతే ఇదే సందర్భంగా జిల్లా జడ్జి గారి ఆదేశమని మేరకు కార్యదర్శి జిల్లా న్యాయ సేవ అధికారుల సంస్థ మరియు సీనియర్ సివిల్ ఆర్ సన్యాసినాయుడు నేడు జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ పానల్ న్యాయవాదులకు లీగలైట్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టం గురించి మరియు న్యాయబంధు యాప్ గురించి అవగాహన కల్పించారు ఈ సమావేశంలో పెద్ద సంఖ్యలో న్యాయవాదులు పాల్గొన్నారు
0 Comments