ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం.

*రైతు బజార్లో ప్రభుత్వ బియ్యం విక్రయ కేంద్రం ప్రారంభం*
*తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం*

*జిల్లావ్యాప్తంగా కేంద్రాలు ఏర్పాటు*

*అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తప్పవు*

*సంయుక్త కలెక్టర్ ఎం.నవీన్*

శ్రీకాకుళం, జూలై 15 : రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అతితక్కువ ధరకే నాణ్యమైన ( సూపర్ ఫైన్ రకం ) బియ్యాన్ని ప్రజలకు అందించనున్నట్లు సంయుక్త కలెక్టర్ ఎం.నవీన్ పేర్కొన్నారు. స్థానిక రైతు బజారులో ఏర్పాటుచేసిన బియ్యం విక్రయ కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమం పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో శనివారం జరిగింది. ఈ కార్యక్రమానికి జెసి ముఖ్య అతిధిగా పాల్గొని కౌంటరును లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం బియ్యాన్ని కొనుగోలుదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం బహిరంగ మార్కెట్ లో బియ్యం ధరలు అధికంగా ఉన్నాయని, వీటిని అరికట్టేందుకు మరియు సాదారణ ప్రజానీకానికి తక్కువ ధరకే బియ్యం కొనుగోలు చేసుకునేలా ఈ కేంద్రాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. ఇందులో సాదారణ రకం బియ్యం రూ.35లు కాగా, బిపిటి రకం బియ్యం రూ.48లుగా నిర్ణయిస్తూ అతి తక్కువ మార్జిన్ తో పౌరులకు అందించనున్నట్లు చెప్పారు. స్థానిక రైతుబజారుతో పాటు నగరంలోని మరో మూడు కేంద్రాల్లో బియ్యాన్ని విక్రయించనున్నట్లు తెలిపారు. సోమవారం నుండి ఆమదాలవలస, కోటబొమ్మాళి రైతుబజార్లలో కూడా ఈ విక్రయ కేంద్రాలు ప్రారంభం కానున్నట్లు స్పష్టం చేశారు. ప్రజల కోసం రాష్ట్ర
ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ కల్పించే ఈ సదవకాశాన్ని జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. బియ్యాన్ని కావాలనే బ్లాక్ చేసి, అధిక ధరలకు విక్రయించాలని చూస్తే అటువంటి వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. బియ్యం ధరల నియంత్రణ కొరకు కమిటీని వేయడం జరిగిందని, ఈ కమిటీ విక్రయ కేంద్రాలను తనికీ చేసి, అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు రుజువైతే చర్యలు తప్పవన్నారు. ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన బియ్యాన్ని అందించాలనే ప్రభుత్వ సంకల్పానికి ప్రజలు సహకరించాలని జెసి ఆకాక్షించారు.

ఈ పర్యటనలో జిల్లా సరఫరాల అధికారి డి.వి.రమణ, మార్కెటింగ్ ఎ.డి కైలాస రావు, డీ ఎం సివిల్ సప్లై, జి.ఎస్.టి రాణిమోహన్, డి.టి గోపాల్, రైతు బజార్ ఈ.ఓ రాజశేఖర్ పౌర సరఫరాల సంస్థ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments