ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

యుద్ధంలో మృతిచెందిన సైనికుల కుటుంబాలకు 300 చ.అ నివాస స్థలములు మంజూరు.జిల్లా కలెక్టరు శ్రీ. శ్రీకేష్ బి లాఠకర్

శ్రీకాకుళం, జూలై 15: యుద్ధంలో మృతిచెందిన సైనికుల కుటుంబాలకు 300 చ.అ నివాస స్థలములు మంజూరు చేస్తామని జిల్లా కలెక్టరు శ్రీ. శ్రీకేష్ లాఠకర్ అన్నారు.

శనివారం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా సైనిక బోర్డు సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 10 సంవత్సరములకు పై బడి మాజీ సైనికుని కోటాలో మంజూరు కాబడిన భూములను 22ఎ నుండి తోలగించుటకు ప్రతిపాదనలు పంపవలసినదిగా అధికారులకు సూచించారు. మాజీ సైనిక సంక్షేమ అంశములపై సమీక్షా జరిగినది. ఈ కార్యాక్రమంలో జూయింట్ కలెక్టరు ఎం. నవీన్, ఇంచార్జ్ జిల్లా రెవిన్యూ అధికారి మురళీ కృష్ణ, జిల్లా అదనపు సూపరెండెంట్ ఆఫ్ పోలీసు మరియు శ్రీమతి.ఎ.శైలజ, జిల్లా సైనిక సంక్షేమాధికారి, వైస్ ప్రెసిడెంట్, గ్రూఫ్ కెప్టెన్ పి.ఈశ్వరరావు (రిటైర్డ్), శ్రీమతి సుధా, జిల్లా ఉపాధి అధికారి, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి, ఖాధీ బోర్డు అధికారి మరియు కల్నల్ యమ్.యన్.రావు తదితరులు సమావేశానికి హాజరైయారు.

Post a Comment

0 Comments