*పలు రంగాల్లో విప్లవాత్మకమైన సంస్కరణలకు శ్రీకారం చుట్టిన సీఎం*
*గ్రామ సచివాలయాలు ఏర్పాటు తో ప్రజలకు మెరుగైన ప్రభుత్వ సేవలు*
*ఏపీ శాసనసభాపతి తమ్మినేని సీతారాం*
ఆముదాలవలస,బూర్జ జూలై 18 ::
దేశ చరిత్రలోనే పాలనలో విప్లవాత్మక మార్పులకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారని, దేశమంతా ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తోందని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు.
మంగళవారం మండలం ఉప్పిన వలస గ్రామంలో సుమారు 40 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయాన్ని స్పీకర్ ప్రారంభించారు. సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది అందిస్తున్న సేవలు, అర్హులకు సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అనే అంశాలపై ఆరా తీశారు. సచివాలయం ద్వారా కల్పిస్తున్న సేవలను గ్రామస్థులు పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఆధునిక పద్ధతిలో సాగు పట్ల అవగాహన కల్పించేలా చొరవ చూపాలని సచివాలయ సిబ్బందికి సూచించారు.గ్రామ సచివాలయాలు,రైతు భరోసా కేంద్రాలు ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు ద్వారా అన్ని రకాల ప్రభుత్వ సేవలు ప్రజల ముంగిటికే వచ్చాయన్నారు. సచివాలయాల వలన ప్రతి సంక్షేమ పథకం అర్హత గల ప్రతి ఒక్కరికి నిజాయితీగా దక్కుతున్నాయన్నారు. సంక్షేమం, అభివృద్ధికి చిరునామాగా ఏపీ నిలిచిందని అన్నారు. పెన్షన్ల పెంపు మొదలుకొని, లక్షలాది ఉద్యోగాల కల్పన, రైతు భరోసా, అమ్మ ఒడి, వసతి దీవెన, విద్యా దీవెన, నాడు- నేడు, విప్లవాత్మక మార్పులతో ఆరోగ్యశ్రీ,, వైయస్సార్ వాహన మిత్ర, చేయూత, మత్స్యకార భరోసా,కాపు నేస్తం లాంటి ఎన్నో కార్యక్రమాలు లక్షలాది కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపాయని అన్నారు.కులం, మతం, పార్టీ, ప్రాంతం చూడకుండా నవరత్నాలు పేరుతో పేదలందరికీ ఇండ్లు అందజేసి దేశ వ్యాప్తంగా సీఎం మన్ననలు పొందారని చెప్పారు.సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయాలు విరివిగా సేవలందిస్తున్నాయన్నారు జల జీవన్ మిషన్ ద్వారా మండలంలో ప్రతి ఇంటికి త్రాగునీరు అందిస్తాం అని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రతినిధి కర్ణేన నాగేశ్వరరావు, జడ్పిటిసి బెజ్జీపురం రామారావు, వైస్ ఎంపీపీ బుడుమూరు సూర్యారావు, కరణం కృష్ణం నాయుడు, పిఎసిఎస్ అధ్యక్షులు బగాది నారాయణమూర్తి, మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు గుమ్మడి రాంబాబు, డి సి సి బి డైరెక్టర్ జల్లు బలరాం నాయుడు మండల పార్టీ కన్వీనర్ వెంకట్రావు స్థానిక నాయకులు శ్రీనివాసరావు,వైస్ సర్పంచ్ కరణం అనిల్ తదితర వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు సర్పంచులు ఎంపీటీసీలు అధికారులు సచివాలయం సిబ్బంది వాలంటీర్లు పాల్గొన్నారు.
0 Comments