*రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి*
*జిల్లాలో 22,794 లబ్ధిదారులకు 24.55 కోట్లు*
*ఋణలు తీసుకున్న 25,614 లబ్దిదారులకు రూ. 68.20 లక్షలు వడ్డి జమ*
*జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్*
శ్రీకాకుళం, జూలై 18: అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందుతాయని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. మంగళవారం జగనన్న తోడు, ఫేస్-VII ఋణాల పంపిణీ మరియు లబ్దిదారులకు వడ్డీ జమ కార్యక్రమాన్ని ఆయన వర్చ్యువల్ విధానంలో లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేశారు. జిల్లా స్థాయిలో కార్యక్రమం జిల్లా కలెక్టరెట్ వీడియో కాన్ఫరెన్స్ లో నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో చిరు వ్యాపారులు రుణాలు తీసుకొని సకాలంలో రుణాలు చెల్లించిన వారికి తిరిగి జగనన్న తోడు పథకాన్ని అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఏ ఒక్కరి మీద ఆధారపడకుండా జగనన్న తోడు లబ్ధిదారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, స్వయం ఉపాధిగా ఉపయోగపడుతుందని తెలిపారు. ఏ ఒక్కరికీ సెక్యూరిటీ లేకుండా ప్రభుత్వమే హామీ ఉంటుందని వివరించారు. లబ్దిదారులు బ్యాంకు ఖాతాలకు నేరుగా జమచేయండం జరుగుతుందన్నారు. అట్టడుగున ఉన్న ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ, తదితర అక్క చెల్లెమ్మలకు అందించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. చిరు వ్యాపారం చేసుకుంటున్న అక్క చెల్లెమ్మలలో ఎవరైనా అర్హత ఉండీ జగనన్న తోడు అందకపోతే అధికారులను సంప్రదించి తిరిగి పొందవచ్చన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా తోపుడు బళ్లు, సాంప్రదాయ వృత్తి కళకారులు, ఫుట్పాత్ లపైన, ప్రజా, ప్రైవేట్ స్థలాల్లో తోపుడు బండ్లపై వ్యాపారాలు చేసుకుంటున్న వారు, తల మీద గంపలో వస్తువులు మోస్తూ అమ్ముకునే వారు, సైకిల్, మోటార్ సైకిల్, ఆటోలపై వెళ్లి వ్యాపారం చేసుకుంటున్న వారు, చేతి వృత్తిదారులు, కళాకారులు, తదితర వ్యాపారులు తమ రోజువారీ వ్యాపార మూలధనం కోసం ప్రైవేట్, వడ్డీ వ్యాపారులపై ఆధారపడకుండా, వారి ఆదాయాలను మెరుగుపరచడానికి రూ.10,000/-లు సున్నా వడ్డీ రుణాలు అందిస్తున్నట్లు వివరించారు. ఈ పధకం అమలుకు ప్రధాన కారణం నేను చేసిన పాదయాత్రేనని, పాదయాత్రలో చూసిన పలు సంఘటనలు నుండే ఈ పధకం పుట్టిందన్నారు.
జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ మాట్లాడుతూ జగనన్న తోడు 2022-23 ఆర్థిక సంవత్సరం ఫేస్-VII ఋణాల పంపిణీ, లబ్దిదారులకు వడ్డీ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. అర్హులైన ప్రతీ ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందుతాయని చెప్పారు. జిల్లాలో 22 వేల 794 లబ్ధిదారులకు 24.55 కోట్ల రూపాయలు, అలాగే ఋణలు తీసుకున్న 25,614 లబ్దిదారులకు రూ. 68.20 లక్షలు వడ్డి జమ చేయనున్నట్లు వివరించారు. సకాలంలో చెల్లించిన వారికి ఏటా మరో రూ.1,000 చొప్పున జోడిస్తూ రూ.13,000 వరకూ వడ్డీలేని రుణాన్ని అందజేయడం జరుగుతుందన్నారు.
*జగనన్న తోడు మా కుటుంబానికి అండగా నిలిచింది*
నా పేరు పి.తులసి, మాది జలుమూరు మండలం తలతరిమ గ్రామం. నేను శ్రీలక్ష్మి స్వయం సహాయక బృందంలో సభ్యురాలిగా ఉంటున్నాను. జగనన్న ప్రవేశపెట్టిన జగనన్న తోడు పథకం క్రింద తొలిసారిగా రూ.10 వేలు తీసుకోవడం జరిగింది. ఆ డబ్బుతో కట్ పీసెస్ బిజినెస్ ప్రారంభించాను. దానిలో నెలకు రూ.4వేలు రావడం జరిగింది. ఈ జీవనోపాధి సరిపోదని, రెండోసారి తోడు పథకం క్రింద పొందిన రూ.10వేలతో సీజనల్ ఫ్లవర్స్ వ్యాపారం చేయడం జరిగింది. ఈ సీజనల్ ఫ్లవర్స్ వ్యాపారంలో నాతో పాటు నా కుటుంబసభ్యులు కూడా భాగస్వాములు అయ్యారు. నేను రెండు ఎకరాల్లో బంతి పూలను పండిస్తే, ఈ పూలతో పాటు విశాఖపట్నం నుండి కూడా పూలను కొనుగోలు చేసి, వాటిని రీ సేల్ చేయడం ప్రారంభించాం. ఇందులో నాకు రూ.6వేలు వరకు, నా కుటుంబసభ్యులకు రూ.10వేల వరకు డబ్బులు వచ్చేవి. ఒక జగనన్న తోడు కార్యక్రమం ద్వారానే ఇంతటి జీవనోపాధిని సంపాదించగలిగాం. అక్కడితో ఆగక మూడవ సారి కూడా తోడు క్రింద రూ.10వేలు వాడుకొని ఒక జిరాక్స్ మిషన్ కొనుక్కోవడం జరిగిందన్నారు. ఈ మిషన్ ద్వారా నెలకు రూ.5వేలు ఆదాయం లభిస్తుందని, ఈ మూడు సార్లు నేను పొందిన తోడు ద్వారా నెలకు రూ.15వేలు సంపాదించుకోగలుగుతున్నామని ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డికి వివరించారు. ఒక్క మా కుటుంబంలోనే రూ.15వేలు వరకు సంపాదన ఆర్జిస్తుంటే, ఇలా కొన్ని లక్షల మంది ఈ తోడును సద్వినియోగం చేసుకొని, ఎంతగా జీవనోపాధిని అభివృద్ధి పరుచుకున్నారో ఊహించలేమని కితాబిచ్చారు. మ్యానిఫెస్టోలో లేకపోయినప్పటికీ తోడును చిరు వ్యాపారులకు అందించాలనే నూతన ఆలోచన చేసినందుకు తమ తరపున కృతజ్ఞతలు తెలిపారు.ఇటువంటి బృహత్తర ఆలోచనలు నిత్య నూతనంగా కలిగి, మాలాంటి వారికి అండగా నిలవాలని ఇటువంటి ముఖ్యమంత్రికి ఆ దేవుడు తోడుగా నిలిచి, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని దేవుని ప్రార్ధిస్తున్నట్లు చెప్పారు.
అనంతరం లబ్ధిదారులకు నమూనా చెక్కులను అందజేశారు.
ఈ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, డిసిసిబి అధ్యక్షలు కరిమి రాజేశ్వరరావు, కళింగ కోమటి కార్పొరేషన్ అధ్యక్షలు అందవరపు సూరిబాబు, పొందర కూరాకుల కార్పొరేషన్ ఛైర్పర్సన్ రాజపు హైమావతి, సూడా చైపర్సన్ ఆశాలత,
డిఆర్డిఎ పిడి విద్యాసాగర్, ఎల్.డి.ఎం ఎం.సూర్య కిరణ్, మెప్మా పిడి కిరణ్ కుమార్, లబ్దిదారులు, తదితరులు పాల్గొన్నారు.
0 Comments