ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

అర్హులకు న్యాయం జరిపేందుకే జగనన్న సురక్ష. ఏపీ శాసనసభాపతి తమ్మినేని సీతారాం

ఆముదాలవలస,జూలై 15 :
 రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ ఫలాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందించడమే జగనన్న సురక్ష కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని ఏపీ శాసనసభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. జగనన్న సురక్ష కార్యక్రమం అమలులో భాగంగా శనివారం ఆయన ఆమదాలవలస మండలంలోని కోర్లకోట గ్రామంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని అర్హులైన వారికి ను వివిధ రకాల ధ్రువీకరణ పత్రాలను అందించారు. ప్రజలకు సంక్షేమ పథకాలను అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్న వాలంటీర్లను ఆయన అభినందించారు.ఈ సందర్భంగా సభాపతి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి రెండు వేల మంది జనాభాకు ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేశారన్నారు.అన్ని రకాల సేవలను ప్రజలు తమ సొంత గ్రామంలోనే పొందేలా గొప్ప మేలు చేశారని కొనియాడారు. పిల్లల చదువులకు అవసరమైన కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలను పొందేందుకు గతంలో వలె మండల కేంద్రానికి వెళ్లే అవసరం లేకుండా గడప దగ్గరే పొందే విధంగా చేశారన్నారు.ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలకు అవసరమైన కుల,ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో పాటు జనన, మరణ ధ్రువపత్రాలు, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్,నూతన రేషన్ కార్డుతో పాటు పాత కార్డులో మార్పులు చేర్పులు,కౌలు రైతు కార్డులు వంటి 11 రకాల ధ్రువీకరణ పత్రాలను అందించి సంక్షేమ పథకాలు పొందకుండా మిగిలిపోయిన వారికి సంక్షేమ పథకాలను అందించాలని ముఖ్యమంత్రి కంకణం కట్టుకున్నారన్నారు.ఆ విధంగా సచివాలయ పరిధిలో వివిధ ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తులు చేసుకోగా,అవసరమైన ధ్రువీకరణ పత్రాలను అందించామన్నారు.ధ్రువీకరణ పత్రాల ఆధారంగా అర్హత మేరకు పథకాల లబ్ధిని పొందనున్నారని వివరించారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ తమ్మినేని శ్రీరామ్ మూర్తి, పి ఎ సి ఎస్ అధ్యక్షులు గురుగుబెల్లి శ్రీనివాసరావు, మండల సచివాలయాల కోఆర్డినేటర్ బొడ్డేపల్లి నిరంజన్ బాబు, డిసిఎంఎస్ డైరెక్టర్ బోడ్డేపల్లి నారాయణరావు, వైస్ ఎంపీపీ మాను కొండ వెంకటరమణ,స్థానిక సర్పంచ్ సనపల అన్నపూర్ణ, స్థానిక నాయకులు నేతాజీ, గురుగుబెల్లి ధర్మారావు, తిర్లంగి రామారావు, సువ్వారి డ్డిల్లి, సువ్వారి రాధాకృష్ణ వైఎస్ఆర్ పార్టీ సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు కార్యకర్తలు వివిధ శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments