*వైద్యులపై గురుతర బాధ్యత*
*పట్టణం నడిబొడ్డున ప్రభుత్వ వైద్య సేవలు*
*త్వరలో జొన్నవలస సి హెచ్ సి తరలింపు*
*భవనాల నిర్మాణాలను వేగవంతంగా పూర్తి చేయాలి*
*అందుబాటులోకి రానున్న పూర్తిస్థాయి వైద్య సేవలు*
*ఏపీ శాసనసభాపతి తమ్మినేని సీతారాం*
ఆమదాలవలస,జులై 15:
సామాన్య ప్రజానీకానికి వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడమే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి దృఢ సంకల్పమని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు.ఆమదాలవలస పట్టణానికి ఆమడ దూరంలో ఉన్న జొన్నవలస లో గల సి హెచ్ సి ను,అతి త్వరలో పట్టణానo లో మున్సిపల్ కార్యాలయం పక్క వంశధార గెస్ట్ హౌస్ లోకి తరలించేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఏపీ శాసనసభాపతి తమ్మినేని సీతారాం అన్నారు.5 ఎకరాల 30 సెంట్లు విస్తీర్ణం ఉన్న,ఈ స్థలంలో సి హెచ్ సి నిర్మాణానికి ప్రభుత్వానికి నివేదించగా అంగీకరించిందన్నారు. ఇందుకు అవసరమయ్యే నిధులను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. మంజూరైన నిధులతో పాత భవనాల ఆధునికరణ,కొత్త భవన నిర్మాణాలు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇంజనీరింగ్ అధికారులు ఆధ్వర్యంలో పనులు కొనసాగుతున్నాయి.పనులను సభాపతి తమ్మినేని సీతారాం, సంబంధిత శాఖ అధికారులతో కలిసి శనివారం పరిశీలించారు. నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.నిర్మాణాలు పూర్తి అయిన వెంటనే సి హెచ్ సి ని, వీటిలోకి తరలిస్తామన్నారు..ఆరోగ్య ఆమదాలవలస నిర్మాణమే తన అభిమతమన్నారు.విద్య పరంగా పలు విద్యాసంస్థలను ఇప్పటికే ఆమదాలవలస నియోజకవర్గంలో సీఎం సహకారంతో ఏర్పాటు చేశామన్నారు.వైద్య రంగం పరంగా ఆమదాలవలస నియోజకవర్గంలో విస్తృతమైన సేవలు ప్రజానీకానికి అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సాయశక్తులా కృషి చేస్తానని స్పీకర్ తమ్మినేని సీతారాం పేర్కొన్నారు.ఆముదాలవలస నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి ప్రభుత్వ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావడమే తన సంకల్పం అన్నారు. ఇప్పటికి దాదాపుగా ప్రతి గ్రామంలోనూ వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ లు ఏర్పాటు చేసేoదుకు వీలుగా,భవన నిర్మాణాలకు చర్యలు చేపట్టినట్లు వివరించారు.ఓ పి పెరగడం అనేది, ప్రభుత్వ ఆసుపత్రిల్లో సేవలు,ప్రజలకు విరివిగా దక్కుతున్నట్లు భావించాలన్నారు.ఈ దిశగా వైద్యులు సామాజిక బాధ్యతను కలిగి ఉండాలన్నారు. తన నియోజకవర్గంలో ఆస్పత్రుల అప్ గ్రేడ్ చేసే విధంగా కృషి చేస్తానని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు
0 Comments