ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

తల్లిదండ్రులు కష్ట ఫలితమే... మీ విజయం

*తల్లిదండ్రులు కష్ట ఫలితమే... మీ విజయం*.

*ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి*.

*పోలీసు సిబ్బంది పిల్లలుకు ప్రతిభా పురస్కారాలు ప్రధానం చేసిన*.*జిల్లా ఎస్పీ జి.ఆర్.రాధిక*.

శ్రీకాకుళం,జులై.16.పోలీసు సిబ్బంది పిల్లలు విజయం వెనుక వారి తల్లిదండ్రులు కష్టం ఉంటుందని, విద్యార్థి దశలో విద్యార్థులు ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ జి.ఆర్.రాధిక హితవుపలికారు.పోలీస్ సిబ్బంది పిల్లలు అత్యంత మార్కులతో మంచి ర్యాంకులు సాధించినప్పుడే తల్లిదండ్రులకు గౌరవం లభిస్తుందన్నారు.ఆదివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ' *మనఆణిముత్యాలు* - *2023*' పేరుతో టెన్త్ క్లాసులో 550 పైబడిన మార్కుల, ఇంటర్మీడియట్ 950 పైబడిన మార్కుల,నీట్,జెఈఈ (అడ్వాన్స్), బిట్స్,ఎంసెట్ తదితర విభాగాలలో మంచి మార్కలతో ఉత్తమ ర్యాంక్లు సాధించిన పోలీసు సిబ్బంది పిల్లలకు ప్రతిభా పురస్కారాలను ప్రదానం చేశారు.2022-23 సంవత్సరంలో పదో తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించిన 19 మందికి, ఇంటర్మీడియట్ విద్యార్థులు 12 మందికి,ఎంట్రన్స్ సెట్స్ లో 8 విద్యార్థులకు ఎంపిక చేసిన విద్యార్థులకు నగదు పురస్కారం తోపాటు ప్రతిభా పురస్కారాలు అందించి ఎస్పీ జి.ఆర్ రాధిక ప్రేత్యేకంగా అభినందించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడాతు .... శాంతిభద్రతల పరిరక్షణ,నేరాల నియంత్రణ, ట్రాఫిక్ క్రమబద్ధీ కరణలో అనేక సవాళ్లను,ఒత్తిళ్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటు పోలీసు సిబ్బంది తమ కుటుంబ కోసం సమయం కేటాయించి పిల్లల బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దుటలో పోలీస్ సిబ్బంది కృషి గర్వించదగ్గ విషయం అని జిల్లా ఎస్పీ జి ఆర్ రాధిక పేర్కొన్నారు.సమాజంలో పోలీసు పిల్లలుకు ఓ ప్రేత్యేకత ఉంటుందని ఎస్పీ తెలిపారు.పోలీసు ఉద్యోగం ఓ గాజు భవనం లాంటిదని, చిన్న తప్పు చేసిన ప్రతిబింబంల చూపిస్తుందని కావున ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో జీవితంకో మెలగాలని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. వచ్చిన మార్కులు, ర్యాంకులతో సంతృప్తి చెందక భవిష్యత్తులో ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఉన్నత స్థానంలో ప్రతి ఒక్కరూ ఉండాలని ఎస్పి ఆకాంక్షించారు. పోలీసు ఉద్యోగం 24 గంటలు అననిత్యం ఎన్నో ఒత్తులు ఎదుర్కొంటూ కుటుంబం, పిల్లలు చదువు పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి ఉన్నతి స్థానం పొందడంలో తల్లిదండ్రులు పాత్ర చాలా గొప్పదని ఎస్పీ తెలిపారు. పోలీసు ఉద్యోగస్తులు ఎటువంటి రిమార్కులు లేకుండా పిల్లలను మంచి మార్గంలో నడిపించాలని తపన పడతారన్నారు. తల్లిదండ్రులు ఆశలను ఆశయాలను మమ్ము చేయకూడదని పిల్లలకు ఎస్పీ సూచించారు. విద్యార్థి దశలో ఎటువంటి చెడు అలవాట్లకు బానిస కాకుండా సన్మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు సోషల్ మీడియా ప్రభావం గురు కాకుండా అవసరాన్ని తగ్గట్టు సెల్ఫోన్లు ఉపయోగించుకోవాలని ఎస్పి.నెగటివ్ ఆలోచనలు ఉండరాదన్నారు. సానుకూల దృక్పథంతో కష్టపడితే ఏదైనా సాధించవచ్చని పేర్కొన్నారు. ఎందరో కానిస్టేబుల్స్, ఎఎస్సై ల పిల్లలు ఐఏయస్ లు, ఐపియస్ లు గా,ప్రముఖ వ్యాపార రంగంలో మంచిగా రాణిస్తున్నారని తెలిపారు. ప్రస్తుత కాలంలో భారతదేశం ప్రపంచంలోనే అన్ని రంగాల్లో ముందస్తుగా రాణిస్తుందని గుర్తించి ఆ దిశలో ప్రతి ఒక్కరు నడుచుకోవాలని ఎస్పీ అన్నారు రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖ అన్నయదలుగా అండగా ఉంటుందని ఎస్పీ సందర్భంగా భరోసా కల్పించారు.

అదనపు ఎస్పీ టి.పి.విఠలేశ్వర్ మాట్లాడుతూ.. చదువుతుపాటు సంస్కారం గొప్పదని గుర్తించాలని హితువుపలికారు.విద్యార్థి దశలోనే నీతి, నిజాయితీ నడుచుకోవాలని పేర్కొన్నారు. పిల్లలు నైతిక విలువలు అలవర్చుకోవాలి. తల్లిదండ్రులును,గురువులను ప్రతి ఒక్కరూ గౌరవించాలని ఆయన తెలిపారు.
అదనపు ఎస్పీ ,జె. తిపే స్వామి మాట్లాడుతూ అనుకున్న లక్ష్యాన్ని కష్టపడి విజయం సాధించాలని, చదువుతున్న ప్రతి విద్యార్ధి విజ్ఞానం పెంపొందించుకోవాలన్నారు.
ర్యాంకులు సాధించిన పోలీసు సిబ్బంది పిల్లలుకు ప్రతిభా పురస్కారాలు అందించి జిల్లా ఎస్పీ,పోలీసు అసోసియేషన్ మా పిల్లల్లో మరింత ప్రోత్సాహం అందించారుని పిల్లలు తల్లిదండ్రులు సంతృప్తిని వ్యక్తపరిచారు.

ఈ కార్యక్రమంలో టౌన్ డిఎస్పీ వై శృతి డిఎస్పీ ఎస్.బాలరాజు,పోలీసు సంఘం కార్యవర్గ సభ్యులు కె రాధాకృష్ణ, కె అప్పన, జగదాంబ,భుజంగరావు,నర్సింగరావు,కృష్ణము నాయుడు, పోలీసు సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు,పిల్లలు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0 Comments