శ్రీకాకుళంలోని ఓ కల్యాణ మండపంలో కళిగాంధ్ర గాంధీ పొట్నూరు స్వామి బాబు అనే శీర్షికతో రూపుదిద్దిన పుస్తకాన్ని రెవెన్యూ శాఖామాత్యులు ధర్మాన ప్రసాదరావు ఆవిష్కరించారు పుస్తక రచయిత నల్లి ధర్మారావును,ఇతర రూపకర్తలను అభినందించారు. కళిగాంధ్ర నేలను ప్రభావితం చేసిన ఇటువంటి మహనీయుల పుస్తకాలను వెలువరించడం అభినందనీయం అని అన్నారు. కళింగ వైశ్యులు ఈ రోజు ఐక్యంగా ఉండడం, సమస్యల పరిష్కారార్థం సంఘటితం అయి పని చేయడం తనకెంతో నచ్చిందని కితాబిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణ దాస్, అందవరపు సూరిబాబు, కోణార్క్ శ్రీనివాస్ రావు తదితరులు పాల్గొన్నారు.
0 Comments