ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

18నాటికి ఇంటింటి ఓటర్ సర్వే శత శాతం కావాలి.వాలంటీర్ల పాత్ర ఎక్కడా ఉండరాదు.జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్


శ్రీకాకుళం, ఆగస్టు 11 : జిల్లావ్యాప్తంగా ప్రత్యేకంగా ఓటర్ల నమోదుపై జరుగుతున్న ఇంటింటి సర్వే ఈ నెల 18నాటికి శత శాతం పూర్తికావాలని జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ ఛాంబరులో మునిసిపల్ కమిషనర్లు, ఈఆర్ఓ, ఎ ఈఆర్ఓలు, బిఎల్ఓలు, సూపర్వేజర్లతో టెలీకాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గత నెల 21న ప్రారంభమైన ఇంటింటి సర్వే ఈ నెల 21తో ముగియనున్నట్లు చెప్పారు. అయితే ఇప్పటి వరకు యాప్ పరంగా 32 శాతం మాత్రమే సర్వే పూర్తయిందని, మిగిలిన జిల్లాలు దాదాపు 80శాతం వరకు పూర్తి చేశాయని కలెక్టర్ గుర్తుచేశారు. యాప్ లో కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నట్లు గుర్తించినప్పటికీ పలు జిల్లాలు చివరి దశకు చేరువలో ఉన్నాయని పేర్కొన్నారు. వేకువజామున మరియు సాయంత్రం వేళల్లో యాప్ బాగా పనిచేస్తున్నందున, ఆ సమయాల్లో బిఎల్ఓలు పనిచేసి లక్ష్యాలను సాధించాలని తెలిపారు. ఇది కొంత కష్టతరమైనప్పటికీ అనుకున్న లక్ష్యసాధన కోసం అందరూ కష్టపడి పని చేయాలని కలెక్టర్ కోరారు. మన లక్ష్యాలను సాధించేందుకు ఇంకా 10రోజుల గడువు మాత్రమే ఉన్నందున,దీన్ని గుర్తెరిగి ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ యాప్ పరంగా కొంత తక్కువగా ఉన్నప్పటికీ, ఫిజికల్ గా ఆగస్టు 18 నాటికి శత శాతం సర్వే పూర్తికావాలని అన్నారు. సర్వే పరంగా చూస్తే టెక్కలి నియోజక వర్గం అన్నిటికంటే వెనుకంజలో ఉందని, అక్కడ 57శాతం మాత్రమే సర్వే ఫిజికల్ గా జరిగిందని అన్నారు. సారవకోట 34 శాతం, కోటబొమ్మాళి మరియు సంతబొమ్మాళి 53.4 శాతం మాత్రమే పూర్తిచేసారన్నారు. సరిగా పనిచేయని బిఎల్ఓల వలన జిల్లాకు చెడ్డ పేరు వస్తుందని, పనిచేయని అధికారులను సస్పెన్షన్ చేసేందుకు కూడా వెనుకాడబోమని కలెక్టర్ హెచ్చరించారు. శని,ఆది వారాలు, స్వాతంత్ర దినోత్సవం మరియు రానున్న ఆదివారం ప్రభుత్వ సెలవు రోజులు అయినప్పటికీ ప్రతి బిఎల్ఓ సిబ్బందితో కలిసి పనిచేసి లక్ష్యాలు సాధించాలని అన్నారు. ఎవరైనా పనిచేయకుంటే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. గారలో 13 శాతం మాత్రమే సర్వే పూర్తయినట్లు ఆన్ లైన్ లో కనిపిస్తుందని, మీ పనితీరు మార్చుకోకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బిఎల్ఓలు ఫారం 6,7,8 తమతో పాటు ఉండాలని, జిల్లాలో జరిగిన 90వేల తొలగింపు ఓటర్లను మరల మరోమారు పునఃపరిశీలించాల్సి ఉందని చెప్పారు. తొలగించేందుకు గల తగిన ధ్రువపత్రాలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. డాక్యుమెంటేషన్ సరిగా లేని బిఎల్ఓ పై చర్యలు తప్పవన్నారు. శతశాతం పరిశీలన అనంతరం ఈ నెల 28న బిఎల్ఓలు రిపోర్టులు సమర్పించాలన్నారు.29న ఏ.ఈ.ఆర్.ఓలు, 30న ఈ.ఆర్.ఓలు రిపోర్టులు డిఈఓకు సమర్పించాల్సి ఉందని కలెక్టర్ తేల్చిచెప్పారు. తొలగింపులపై ఎన్నికల కమీషన్ మార్గదర్శకాలను తప్పక పాటించాలని, జాబితాలు రూపొందించడంలో పారదర్శకత ఉండాలని, ఎవరి నుండి ఫిర్యాదులు అందరాదని ఆదేశించారు.

వాలంటీర్ల పాత్ర ఎక్కడా ఉండరాదని కలెక్టర్ అదేశించారు. ఈ.ఆర్.ఓ, ఏ.ఈ.ఆర్.ఓలు రాజకీయ పార్టీలతో సమావేశాలను నిర్వహించాలని, వారికి చేర్పులు, తొలగింపులు, మార్పులు వివరాలు అందజేసినట్లుగా సంతకాలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

Post a Comment

0 Comments