ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

రాజీమార్గం మాత్రమే రాజమార్గం.జిల్లా ప్రధాన న్యాయమూర్తి జువైద్ అహ్మద్ మౌలానా

శ్రీకాకుళం 10 ;   రాజీమార్గం మాత్రమే రాజమార్గం అని దీన్ని కక్షిదారులు గ్రహించి విరివిగా ముందుకు వచ్చి కేసులు రాజీ చేసికోవాలని శ్రీకాకుళం జిల్లా ప్రధాన న్యాయమూర్తి జువైద్ అహ్మద్ మౌలానా  అన్నారు. సెప్టెంబర్ 9వ తేదీన  జాతీయ లోక్అదాలత్ శ్రీకాకుళం జిల్లా అంతటా ఘనంగా జరుపుతున్నామని  సుమారు 7 వేల కేసులు రాజీకి సంబంధించినవిగా గుర్తించామన్నారు.జాతీయ లోక్అదాలత్ కు సంబంధించి అందరికీ ముందస్తు సమాచారం అందించామన్నారు.గురువారం శ్రీకాకుళం జిల్లా న్యాయస్థానం ఆవరణలో జిల్లా జడ్జి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ లోక్అదాలత్ ఉద్దేశ్యాన్ని కక్షిదారులకు విస్తృత స్థాయిలో వివరించామని అన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, స్వంచ్చంద సంస్థల ప్రతినిధులు, ప్రజా సంఘాలు, బార్ అసోసియేషన్ సభ్యులు లోక్అదాలత్ విజయవంతానికి సంపూర్ణ సహకారాన్ని అందించాలని జిల్లా జడ్జి కోరారు. జిల్లాలో  మోటర్ ఆక్సిడెంట్ కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయని వాటిని పరిస్కరనికి ముంధుకు రావాలన్నారు . ప్రతి ఒక కక్షి దారుడు జాతీయ లోక్అదాలత్ ను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు .

Post a Comment

0 Comments