శ్రీకాకుళం,ఆగస్టు,12: ఆంధ్ర ప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విధ్యాలయాల సంస్థ ఆద్వర్యం లో నడపబడుచున్న అంబేద్కర్ గురుకుల పాఠశాల/కళాశాల (బాలికలు) మందస లో ఖాళీ గా వున్న టి.జి.టి. ఫిజికల్ సైన్స్ (1 పోస్ట్) కు ఇంగ్లీష్ మాధ్యమంలో బోధించుటకు ఆసక్తి గల మహిళ అభ్యర్థుల నుండి మాత్రమే వాక్ ఇన్ ఇంటర్వ్యూ మరియు డెమో ద్వారా గెస్ట్ ఉపాధ్యాయులు ఎంపిక తేది: 14.08.2023 మధ్యాహ్నం 03.00 గం.. నుండి జిల్లా కో- ఆర్డినేటర్, ఏ.పి.యస్.డబ్ల్యూ, ఆర్.ఇ.ఐ సొసైటీ, ఆదివారంపేట, శ్రీకాకుళం జిల్లా నందు నిర్వహించబడును. కావున ఆసక్తి గల మహిళ అభ్యర్థులు మాత్రమే వారి యొక్క బయోడేటా తో పాటు P.G. B.ED మరియు TET మరియు అనుభవ ధ్రువ పత్రములు ఒక జత జిరాక్స్ కాపీలు జతపరచి మరియు ఒరిజినల్ విద్యార్హత సర్టిఫికెట్స్ తో పాటుగా తేది: 14.08.2023 హాజారు కావాలి అని శ్రీ ఎన్. బాలాజీ నాయక్, జిల్లా సమన్వయాధికారి, ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విధ్యాలయముల సంస్థ శ్రీకాకుళం వారు తెలియజేసియున్నారు.
పూర్తి సమాచారం కొరకు యీ క్రింది తెలుపబడిన ఫోన్ నెంబర్స్ కు సంప్రదించవలెను ఫోన్ నెంబర్స్ : 08942 279926, 9701736862, 9000314209
0 Comments