శ్రీకాకుళం,ఆగస్టు.12. డాక్టర్ వృత్తిలో ఉంటు పోలీసులు దైనిందాక విధి నిర్వహణలో ఉన్న సాధక బాధలు తెలుసుకుని వర్షాలు పడే సమయంలో హోంగార్డులకు ఎంతోగానో ఉపయోగపడే రైన్ కోట్స్ ఇవ్వడానికి డాక్టర్.దానేటి శ్రీధర్ ముందుకు రావడం ఎంతో అభినందనీయమని జిల్లా ఎస్పీ జి.ఆర్.రాధిక కొనియాడారు.శనివారం ఉదయం జిల్లా పోలీసు కార్యాలయంలో
జిల్లాలో పనిచేస్తున్న హోంగార్డులకు డాక్టర్. దానేటి శ్రీధర్ ఆర్ధిక సహకారంతో కొనుగోలు చేసిన రైన్ కోట్స్ ను జిల్లా ఎస్పీ జి.ఆర్.రాధిక చేతులు మీదుగా అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఇటీవల ఆర్ధికంగా వెనకబడిన పేద విద్యార్థులకు స్కాలర్షిప్ అందించి ఎన్నో సేవా కార్యక్రమములు అందిస్తున్న డాక్టర్ శ్రీధర్ సేవలు మరువలేనవి అని ఎస్పీ పేర్కొన్నారు. పోలీస్ శాఖకు మీ వంతు సహకారాన్ని అందించాలని కోరిన వెంటనే ఆయన స్పందించి వర్షాకాలంలో హోంగార్డు లకు ఎంతగానో ఉపయోగపడే 300 రైన్ కోట్స్ ఇవ్వడానికి ముందుకు వచ్చారని ఎస్పీ తెలిపారు. అంతేకాకుండా హోం గార్డ్ పిల్లలు డిగ్రీ తదితర ప్రొఫెషనల్ కోర్సులు చదువుకోడానికి ఆర్థిక సోమత లేనియెడల డాక్టర్ శ్రీధర్ ను సంప్రదిస్తే ఆర్థిక సహకారం చేయటానికి
ఆయన ఎల్లవేళలా అందుబాటులో ఉంటారుని ఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ జిల్లా పోలీస్ శాఖ తరపున డాక్టర్ శ్రీధర్ నకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.
డాక్టర్ దానేటీ శ్రీధర్ మాట్లాడుతూ జిల్లా పోలీసు యూనిట్ అధికారిణిగా పోలీసు సిబ్బంది సంక్షేమనకు అనేక కార్యక్రమాలు చేపట్టారు.జిల్లా పోలీసు యంత్రాంగన్నీ ఒక కుటుంబంలా భావించి ముందుకు తీసుకువెళ్లి అందరు మన్నాన్నలు పొందుతున్నారుని కొనియాడారు.ఇందులో భాగంగా హోంగార్డులకు మీవంతు సహకారాన్ని అందించాలని కోరగా నా వంతు ఓ చిన్న సహకారాన్ని హోంగార్డులకు అందించానిన్నారు.ప్రతి ఏటా 20లక్షల రూపాయలు హోంగార్డుల పిల్లలు ఉన్నత చదువులు కోసం ఈ ఏడాది నుంచి కేటాయిస్తున్నానని తెలిపారు.అనంతరం జిల్లాలో పనిచేస్తున్న హోం గార్డలకు రైన్ కోట్స్ జిల్లా ఎస్పీ,శ్రీధర్ అందజేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పి జే తిపే స్వామి డిఎస్పిలు ఎస్ వాసుదేవ్ వై.శృతి, డి.ప్రసాదరావు,ఆర్ఐ ఉమా మహేశ్వరావు హోంగార్డ్స్ పాల్గొన్నారు
0 Comments