శ్రీకాకుళం, ఆగష్టు 9:- రక్తధానం మహాధానం అని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ అన్నారు. బుధవారం శ్రీకాకుళం యూనియన్ బ్యాంక్ ప్రాంతీయ కార్యలయం ఆద్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ శ్రీకాకులం శాఖ వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన రక్తదాన శిభిరానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ రీజనల్ హెడ్ శ్రీ వెంకట తిలక్, చీఫ్ మేనేజర్ దుర్గాప్రసాద్, జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్, ఎం. సూర్య కిరణ్ పర్యవేక్షణలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో ఇండియన్ రెడ్ క్రాస్ ప్రతినిధులు జిల్లా ఛైర్మన్ పి జగన్మోహన రావు, రెడ్ క్రాస్ AJC పి.రజినీకాంతరావు, జాతీయ యువజన అవార్డు గ్రహీత పెంకి చైతన్యకుమార్, కె సత్యనారాయణ, నిక్కు అప్పన్న తదితరులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లాలో గల యూనియన్ బ్యాంక్ మేనేజర్లు, బ్యాంక్ సిబ్బంది100 మందికి పైగా పాల్గొని రక్తధానం చేశారు, పాల్గొన్న ప్రతీ ఒక్కరినీ జిల్లా కలెక్టర్, రీజినల్ హెడ్ తిలక్ ప్రత్యేకం గా అభినందించి సర్టిఫికెట్స్ ప్రదానం చేశారు.
0 Comments