*అమవీరుల త్యాగాలు భావితరాలకు తెలియజేయాలి*
*జిల్లా ప్రజలకు పిలుపునిచ్చిన జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్*
శ్రీకాకుళం, ఆగష్టు 09 : స్వాతంత్ర్యం కోసం అసువులు బాసిన అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ, దేశ ఔన్నత్యాన్ని దశదిశలా చాటి చెప్పేందుకు స్వాతంత్ర్య మహోత్సవంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక శాంతినగర్ కాలనీలో గల గాంధీ స్మృతి వనంలో మేరా మట్..మేరా దేశ్ ప్రారంభోత్సవ కార్యక్రమం నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో జరిగాయి. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్.పి ముఖ్యఅతిథిలుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా వార్షికోత్సవ కార్యక్రమాన్ని చేపడుతున్నామని, దానికి ముగింపు కార్యక్రమాన్ని ఈ నెల 15న నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీకేశ్ లాఠకర్ తెలిపారు. దానిలో భాగంగా మేరా మట్..మేరా దేశ్ కార్యక్రమాన్ని కూడా చేపడు తున్నట్లు చెప్పారు. ప్రతిజ్ఞ,అమరవీరులకు వందనం, ప్రతి పంచాయతిలో 75 మొక్కలు నాటే వసుధా వందనం, భారత ప్రధాని, రాష్ట్ర ముఖ్యమంత్రి సందేశంతో కూడిన శిలాఫలకాల ఆవిష్కరణ, అమరవీరులను గుర్తించడం వంటి ఐదు రకాల కార్యక్రమాలను ఆగస్టు15వరకు జిల్లాలో గల 912 గ్రామ పంచాయతీలతో పాటు 75 వార్డుల్లో నిర్వహించబోతున్నట్లు కలెక్టర్ వివరించారు. ఆగస్టు 15 తరువాత ప్రతి గ్రామ,మండల,శాసనసభ నియోజక వర్గం నుండి కొంత మట్టిని సేకరించి, దాన్ని ఢిల్లీకి పంపడం జరుగుతుందని అన్నారు.అక్కడ కూడా ఈ నెల 15 తరువాత ఒక కార్యక్రమాన్ని నిర్వహించబోనున్నట్లు స్పష్టం చేశారు. కావున జిల్లాలోని వృద్ధులు,పెద్దలు,పిల్లలు అందరూ వారి స్థాయిలో ఈ స్వాతంత్య్ర మహోత్సవంలో పాల్గొని విజయవంతం చేయాలని కలెక్టర్ ఆకాక్షించారు.
జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జి.ఆర్.రాధిక మాట్లాడుతూ స్వాతంత్ర్య మహోత్సవ వారోత్సవాలను జిల్లావ్యాప్తంగా నిర్వహించు కుంటున్నామని చెప్పారు.అందులో భాగంగా ఐదు రకాల కార్యక్రమాలను చేపడుతున్నామని అన్నారు. పోలీస్ అమరవీరులను స్మరించుకోవడం, వారి కుటుంబాలను సన్మానించుకోవడం జరిగిందని తెలిపారు. ప్రతి పంచాయతీలో 75 మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా పోలీస్ శిక్షణ కళాశాలలో మొక్కలు నాటడం జరిగిందని ఆమె వివరించారు. భారతదేశ స్వాతంత్య్రం కోసం అమరులైన త్యాగమూర్తులను స్మరించుకోవడంతో పాటు మన దేశ ఔన్నత్యాన్ని, కీర్తి ప్రతిష్టలను మున్ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలని ఆమె పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, నగరపాలక సంస్థ కమిషనర్ ఓబులేసు, డి.ఆర్డి.ఎ, పి.డి విద్యాసాగర్, జిల్లా పంచాయతీ అధికారి రవికుమార్, మెప్మా పి.డి కిరణ్, జెడ్పి పి సిఈఓ వెంకట్ రామన్, డ్వామా పి.డి చిట్టి రాజు, ఆయుష్ డాక్టర్ జగన్నాధం, సెట్విజ్ సిఈఓ ప్రసాద రావు, ఎన్ వై కె కోఆర్డినేటర్ ఉజ్వల, శాసపు జోగినాయుడు, గాంధీ మందిర్ కమిటీ ప్రతినిధులు ఎం ప్రసాదరావు కొంక్యాన వేణుగోపాల్, ఎంవిఎస్ఎస్ శాస్త్రి, వి.జగన్నాథ నాయుడు,నక్క శంకర్రావు, కొంక్యాన మురళీధర్, గుర్తు చిన్నారావు, దేవభూషణరావు, నటుకుల మోహన్,పొన్నాడ రవి,హారిక ప్రసాద్, పందిరి అప్పారావు, ఎం అనంత భట్లు, ఆర్మీ కాలింగ్ ప్రతినిధులు రమణ, కిరణ్తదితరులు పాల్గొన్నారు.
#sikkolu_media
#gangu_manmadharao
0 Comments