శ్రీకాకుళం, ఆగష్టు 25: కార్నియల్ అంధులకు నేత్రదానంతోనే వెలుగు ప్రసాదించవచ్చు అని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డా. బి మీనాక్షి అన్నారు. 38 వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు సందర్భంగా ఈనెల 25 నుండి సెప్టెంబరు 8 వరకు జిల్లాలో నేత్రదానంపై ప్రజలకు అవగాహన కల్పించి చైతన్య పరిచి మరింత మంది నేత్రదానికి ముందుకు వచ్చేటట్లు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. కార్నియల్ అంధులలో చూపును నేత్రదాతల నుంచి సేకరించిన కార్నియా మార్పిడి ద్వారా మాత్రమే ప్రసాదించవచ్చునని, ప్రత్యామ్నాయం లేదు కాబట్టి ప్రజలందరూ నేత్రదానం పట్ల అవగాహన కలిగి ఎవరైనా తమ కుటుంబంలో మరణించిన తర్వాత వారి బంధువులు నేత్రదానానికై అంగీకరించి సమాచారాన్ని నేత్ర సేకరణ కేంద్రానికి వెంటనే తెలియపరచి ఇద్దరూ కార్నియల్ అందుల జీవితాల్లో వెలుగు నింపచ్చన్నారు. జిల్లాలో పారామెడికల్ ఆప్తాల్మిక్ అధికారుల ద్వారా నిర్వహిస్తున్న వైయస్సార్ కంటి వెలుగు శిబిరాల్లో నేత్రదానంపై విస్తృతంగా అవగాహన సదస్సులు, ర్యాలీల కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు.
0 Comments