ప్రజా పత్రిక

Ticker

6/recent/ticker-posts

ఎన్నికల రథ సారథి దాసన్న- 2024 క్లీన్ స్వీప్ లక్ష్యం- 46 మందితో కొత్తగా పార్టీ కమిటీ - కమిటీలో అన్ని నియోజకవర్గాలు, సామాజిక వర్గాలకు సముచిత ప్రాతినిధ్యం

శ్రీకాకుళం, ఆగస్ట్ 25: వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్ష బాధ్యతల్ని పార్టీకి తొలి ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ కే అప్పగిస్తూ పార్టీ అధిష్టానం  గురువారం సాయంత్రం నిర్ణయించింది. 2024 ఎన్నికల్లో జిల్లాలో 8 అసెంబ్లీ స్థానాలు, ఒక పార్లమెంట్ స్థానాన్ని క్లీన్ స్వీప్ చేయడమే లక్ష్యంగా  పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు 46 మందితో జిల్లా కమిటీని నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. పార్టీ జిల్లా అధ్యక్ష పదవిని మరోసారి మాజీ డిప్యూటీ సీఎం, నరసన్నపేట సీనియర్ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్ కు అప్పగించింది. 2024 ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో పార్టీ గెలుపే లక్ష్యంగా నిర్ధేశిస్తూ ఏర్పాటు చేసిన  కొత్త కమిటీలో ఇద్దరు ఉపాధ్యక్షులను, నలుగురు ప్రధాన కార్యదర్శులను, ఎనిమిది మంది కార్యదర్శులను, ఒక కోశాధికారి, 30 మంది కార్యవర్గ సభ్యులను నియమించారు. జిల్లా అధ్యక్షుడిగా మరోసారి నియమితులైన ధర్మాన కృష్ణదాస్ తో పాటు కార్యవర్గ సభ్యులందరినీ పార్టీ నాయకులు, శ్రేణులు అభినందిస్తున్నారు. సీనియారిటీతో పాటు విధేయతకు పెద్దపీటవేశారని, అన్ని ప్రాంతాల వారిని కలుపుకుని రానున్న ఎన్నికలకు పార్టీని సన్నద్ధం చేసేందుకు దోహదపడేలా కొత్త కమిటీని ఏర్పాటు చేశారని అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

పార్టీకి విధేయుడిని
- ధర్మాన కృష్ణ దాస్ 
 నా పట్ల నమ్మకం ఉంచి మరోసారి కీలక బాధ్యతలు అప్పగించిన సీఎం జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు. రానున్న ఎన్నికల్లో మరోసారి జిల్లా నుంచి అత్యధిక స్థానాలు గెలుచుకునేలా కష్టపడతాం. నవరత్నాలు మాకు శ్రీరామరక్ష. చెప్పినవన్నీ చేసాం. 98% హామీలు అమలు చేయడం అంటే మామూలు విషయం కాదు. ఇప్పటికే ప్రజల్లో ప్రభుత్వంపై పూర్తి విశ్వాసం ఉంది. ఆ విశ్వాసాన్ని కోల్పోకుండా పనిచేస్తాం.

నూతన కార్యవర్గమిదే : 

అధ్యక్షుడు: ధర్మాన కృష్ణదాస్
ఉపాధ్యక్షుడు: రౌతు శంకరరావు (శ్రీకాకుళం)
కోశాధికారి: లోతుగడ్డ తులసీ వరప్రసాద్ రావు(పాతపట్నం)
ఉపాధ్యక్షుడు: పాలిన శ్రీనివాసరావు (పలాస)
ప్రధాన కార్యదర్శి: శిమ్మ రాజశేఖర్(శ్రీకాకుళం)
ప్రధానకార్యదర్శి: బన్నా రాము (ఆమదాలవలస) 
ప్రధానకార్యదర్శి:బర్ల వేణుగోపాల్ (నరసన్నపేట) 
ప్రధానకార్యదర్శి: బడగాల బాలచంద్రుడు (పలాస)

కార్యదర్శి: పిన్నింటి సాయికుమార్(ఎచ్చెర్ల)
 కార్యదర్శి: గుండా మోహనరావు (శ్రీకాకుళం)
 కార్యదర్శి: బి. పద్మావతి(ఆమదాలవలస)
 కార్యదర్శి: బైలపల్లి రామారావు (ఇచ్చాపురం)
 కార్యదర్శి: పోలాకి సోమేష్( టెక్కలి) 
కార్యదర్శి: బుర్లె శ్రీనివాసరావు(పాతపట్నం)
 కార్యదర్శి: మంత్రి రాము (నరసన్నపేట)
 కార్యదర్శి: దల్లి జానకీరావు (పలాస)

కార్యవర్గ సభ్యులుగా : 
అంబటి రాంబాబు(ఎచ్చెర్ల), బొంతు సూర్యనా రాయణ (ఎచ్చెర్ల), శింకా గౌరీ(ఎచ్చెర్ల), పిల్లాల శివకుమార్ (ఎచ్చెర్ల), ఉప్పాడ కవిత (శ్రీకాకుళం), పలకా పార్వతి(శ్రీకాకుళం), కె.ఎస్.ఎం. సైలానీ (శ్రీకాకుళం), బాడంగి సురేష్ (ఆమదాలవలస), అట్ల రమేష్ (ఆమదాలవలస), బగ్గు కుమారస్వామి(ఆమదాలవలస), మీసాల మంజుల (ఇచ్చాపురం, తిప్పాడ నాగరాజు(ఇచ్చాపురం), గూడ తాతారావు (ఇచ్చాపురం), పొల్లాయి నీలాచ లం(ఇచ్ఛాపురం), సూరాడ రాజారావు (టెక్కలి), బొడ్డు వెంకటరమణ (టెక్కలి), చుక్కా గున్నమ్మ(టెక్కలి), మాదిన శ్రీదేవమ్మ (టెక్కలి), తాళ్లబత్తుల ప్రసాదరావు (పాతపట్నం), ముగడ జనార్ధనరావు(పాతపట్నం), వంగపల్లి చిన్నారా వు(పాతపట్నం), దంబురాం రాజ్యలక్ష్మీ (పాతపట్నం), గేదెల క్రాంతికుమార్ (నరసన్నపేట), బెండి శ్రీను(నరసన్నపేట), కోటిపల్లి శ్రీనివాస రావు(నరసన్నపేట), పాట్నూరు క్రిష్ణప్రసాద్ (నరసన్నపేట), తామడ సరస్వతి (పలాస), కుర గౌడ(పలాస), దున్నా సత్యం (పలాస), దేవర కొండ షణ్ముఖరావు(పలాస) వీరితోపాటు 
పాతపట్నం నియోజకవర్గం ఎల్ఎన్పేట జేసీఎస్ అధ్యక్షుడిగా ఎల్ఎన్ పేటకు చెందిన పెనుమజ్జి సర్వేశ్వరరావు నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వీరి నియామక ఉత్తర్వులను పార్టీ కేంద్ర కార్యాలయం విడుదల చేసింది.


28న నూతన కమిటీ ప్రమాణస్వీకారం 

నూతనంగా నియమించిన జిల్లా పార్టీ కమిటీ కార్యవర్గానికి ఈ నెల 28న సాయంత్రం నాలుగు గంటలకు శ్రీకాకుళం అంబేద్కర్ ఆడిటోరియంలో (కోడి రామ్మూర్తి స్టేడియం దరి)  ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. సభ, నూతన కమిటీ ప్రమాణ స్వీకారం కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని పార్టీ కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమానికి జిల్లాలోని మంత్రులు, శాసనసభ్యులు, ఎంఎల్సీలు, జెడ్పీ చైర్ పర్సన్, ఎంపిపీలు, జెడ్పీటిసీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, నామినేటెడ్ పదవుల్లో ఉన్నవారు, పార్టీ నాయకులంతా హాజరుకావాలని కోరారు.

Post a Comment

0 Comments